రేవంత్ వర్సెస్ కేటీఆర్.. వేడెక్కిన ట్విటర్ వార్, రెండు వర్గాలుగా నెటిజన్లు

డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నెలకొంది. కేటిఆర్ కోసం అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

ప్రధానాంశాలు:డ్రగ్స్ కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయాలుకేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విటర్ వార్డ్రగ్స్ టెస్టుకు తాను రెడీనంటూ ట్వీట్తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ కేసు వ్యవహారంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మంత్రి కేటీఆర్‌కి వైట్ చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు రావాలని.. అక్కడికొస్తే ఆసుపత్రికి వెళ్లి డ్రగ్స్ టెస్టు చేసుకుందాం అని రేవంత్ సవాల్ విసిరారు.

రేవంత్ సవాలుపై ట్విటర్ ద్వారా స్పందించిన కేటీఆర్… ‘నేను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమా?… ఆ టెస్ట్‌లో నాకు క్లీన్ చిట్ వస్తే మీరు క్షమాపణలు చెబుతారా?… చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో నా స్థాయి కాదు. క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణలు చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా? అని కేటీఆర్ ట్వీట్‌లో సవాలు చేశారు.

అయితే కేటీఆర్ ట్వీ్ట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనత వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోందని కొందరు, ఈ కేసులో రాహుల్ గాంధీ అనవసరంగా లాగుతున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. కేసీఆర్ డ్రగ్స్ టెస్టుకు భయపడుతున్నారని, డ్రగ్స్ వినియోగించనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేటీఆర్‌కు మద్దతుగా మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వీటిని తింటే ఐరన్ లోపం తగ్గుతుందట..

Mon Sep 20 , 2021
మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. సరైన పోషకాహారం రెగ్యులర్ డైట్‌లో తీసుకుంటూ ఉండాలి. మన బాడీకి అవసరమయ్యే పోషక పదార్థాలలో ఐరన్ కూడా ఒకటి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఐరన్ మనకి చాలా ముఖ్యమని... ముఖ్యంగా రెస్పిరేషన్, సరైన ఇమ్యూన్ ఫంక్షన్‌కి చాలా అవసరమని తెలుస్తోంది.