బ్యాంక్ పని ఉందా? ఇవాల్టి నుంచి మారిన పనివేళలు

ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు లాక్‌డౌన్‌ సడలింపునకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ పనిచేసే వేళల్లో కూడా మార్పులు వచ్చాయి.

ప్రధానాంశాలు:రాష్ట్రంలో పగటిపూట లాక్ డౌన్ ఎత్తివేత సాయంత్రం 5 వరకు సడలింపులు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు బ్యాంకులుతెలంగాణలో ఇవాల్టి నుంచి లాక్ డౌన్ సడలింపులు అమలు కానున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారాలకు, ప్రజలకు అనుమతి ఉంది. ఈ క్రమంలో ఇవాల్టి నుంచి బ్యాంకులు పనిచేసే వేళల్లో కూడా మార్పులు వచ్చాయి. నిన్నమొన్నటి వరకు కరోనా లాక్ డౌన్‌తో మధ్యాహ్నం వరకే బ్యాంకులు పనిచేశాయి. అయితే గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని పేర్కొంది.

మంగళవారం కేబినెట్‌లో లాక్‌డౌన్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించడంతో పాటు సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే. మేలో లాక్‌డౌన్‌ అమలు చేసిన నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారాయి. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, జూన్‌ ఒకటో తోదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించాయి.

అయితే ఈ నెల 10 నుంచి లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. బ్యాకింగ్‌ సమయ వేళలను ఖాతాదారులు గమనించాలని ఎస్‌ఎల్‌బీసీ సూచించింది. సాయంత్రం వరకు బ్యాంకులు పనిచేస్తాయని ఖాతాదారులకు బ్యాంకు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కుటుంబసభ్యులకు కరోనా సోకితే 15 రోజుల ప్రత్యేక లీవులు!

Thu Jun 10 , 2021
తల్లిదండ్రులు, తమపై ఆధారపడిన కుటుంబసభ్యుల కరోనా బారినపడినప్పుడు సెలవుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు దృష్టికి తీసుకొచ్చారు.