Telangana Unlock: తెలంగాణలో అన్‌లాక్ గైడ్‌లైన్స్ ఇవే.. ఇది పాటించకపోతే అంతే..

Telangana Unlock: జూన్ 19 వరకు అమల్లోఉన్న లాక్‌డౌన్‌ 20 నుంచి సంపూర్ణంగా ఎత్తేయనున్నారు. దీంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి.

ప్రధానాంశాలు:తెలంగాణలో అన్ లాక్మార్గదర్శకాలు విడుదలఈ నిబంధనలు పాటించాల్సిందే..తెలంగాణలో లాక్ డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తేస్తున్నట్లు తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికల మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 19 వరకు అమల్లోఉన్న లాక్‌డౌన్‌ 20 నుంచి సంపూర్ణంగా ఎత్తేయనున్నారు. దీంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి. ఈ క్రమంలో తాజాగా అన్‌లాక్‌‌కు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. లాక్‌డౌన్‌కు ముందున్న అన్ని కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మార్గదర్శకాలివీ..
* బహిరంగ ప్రదేశాలు, పని చేసే చోట మాస్కు కచ్చితంగా ధరించాలి.
* మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా
* ఆఫీసులు, దుకాణాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.
* నిర్దేశిత భౌతిక దూరం, శానిటైజేషన్‌ తప్పనిసరిగా అమలు చేయాలి.
* జూలై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు తెరిచేందుకు సన్నద్ధం కావాలి.

నోరు జారిన ఈటల రాజేందర్, పక్కనే బండి సంజయ్ షాక్! ఆ వెంటనే సరి చేసుకొని.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల రీఓపెన్.. డేట్ ఫిక్స్, కేబినెట్ సంచలన నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ 8 యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. లేకపోతే డేటా హుష్‌కాకి!

Sat Jun 19 , 2021
జోకర్ వైరస్ ఇప్పట్లో గూగుల్‌ను వదిలేలా లేదు. ఇప్పుడు తాజాగా మరో 8 ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఈ వైరస్ కనిపించింది. దీన్ని క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు.