రాయలసీమ ఎత్తిపోతలపై.. తెలంగాణ ధిక్కరణ పిటిషన్‌

గతంలో రాయలసీమ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్‌ పిటిషన్ వేశారు. ఈ విచారణను వాయిదా వేశారు. దీంతో స్వయంగా ఎన్జీటీనే రంగంలోకి దికి ప్రాజెక్టును తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఏఏజీ.

ప్రధానాంశాలు:రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీరియస్ ఎన్టీటీలో ధిక్కరణ పిటిషన్ స్వయంగా ఎన్జీటీ రంగంలోకి దిగాలని విజ్ఞప్తి
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచంద్రరావు ప్రస్తావించారు. గతంలో రాయలసీమ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై విచారణను ఎన్జీటీ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ విచారణకు రాకపోవడంతో తాము కూడా ధిక్కరణ పిటిషన్‌ వేశామని ఏఏజీ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు.

గత ఎన్జీటీ ఆదేశాల ప్రకారం కేఆర్‌ఎంబీ, కేంద్రపర్యావరణ శాఖ అధికారులు రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నేడు నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం తనిఖీ చేయకుండా అధికారులను అడ్డుకోవడంతో ఇంతవరకు ఆ విభాగాలు నివేదిక ఇవ్వలేదని ఏఏజీ ఎన్జీటీకి తెలిపారు. స్వయంగా ఎన్జీటీనే రంగంలోకి దికి ప్రాజెక్టును తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం వేసిన ధిక్కరణ పిటిషన్‌ను జతచేసి విచారణ చేపట్టాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం తమ దృష్టిలో ఉందని, జాబితా ప్రకారం ఈ నెల 23న విచారణ జరుపుతామని ఎన్జీటీ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మహిళలకు జగనన్న మరో వరం... ఏడాదికి 6లక్షల మందికి మేలు

Tue Jul 13 , 2021
సాధారణ మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు వ్యాపారం చేసుకునేలా వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.