కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్: ట్విస్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, 4 సార్లు భోజనం పెట్టి..

Telangana Congress: టీఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంలో చురుగ్గా ప్రచారం చేస్తున్నా కానీ, వారికి ఉప ఎన్నికల్లో అభ్యర్థి కరవయ్యాడని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

హుజురాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తారని తనకు ముందే తెలుసని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నాడని ఎప్పటి నుంచో తనకు సమాచారం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌లో కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టికెట్ ఇస్తారని తాను అనుకోవడం లేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న మాటలన్నీ ఆయన స్వతహాగా మాట్లాడడం లేదని, కేసీఆర్ మాట్లాడించిన మాటలు అని రేవంత్ విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంలో చురుగ్గా ప్రచారం చేస్తున్నా కానీ, వారికి ఉప ఎన్నికల్లో అభ్యర్థి కరవయ్యాడని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

మిగతా అంశాలపై స్పందిస్తూ.. మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు కాంగ్రెస్‌లో సమ న్యాయం ఉండేలా చూసుకుంటామని చెప్పారు. టీడీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. కేసీఆర్ టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

చాలా మంది ఇతర పార్టీల నేతలు తమతో టచ్‌లోకి వస్తున్నారని, ముగ్గురు కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు మంగళవారం కాంగ్రెస్‌లో చేరినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పేరును ఇప్పుడే చెప్పబోమని, బలమైన అభ్యర్థిని ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టుడే ఇన్‌స్టా హిట్స్: మరోసారి కవ్విస్తున్న సమంత... అద్దం ముందు చాందినీ భంగిమలు

Tue Jul 13 , 2021
సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు ప్రతీ రోజు ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. అలా సెలబ్రటీలు పోస్ట్ చేసిన ఆసక్తికర విషయాలను మీ ముందు ఉంచాలనేదే మా ఈ ప్రయత్నం. ఈ రోజు (జూలై 13వ) సెలబ్రిటీలు పోస్ట్ చేసిన అప్‌డేట్స్ ఏంటో ఓ లుక్ వేయండి..