మరోసారి యశోద హాస్పిటల్‌కి కేసీఆర్?… లాక్‌డౌన్‌పై రెండ్రోజుల్లో కీలక నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యశోద హాస్పిటల్‌కి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో మరోసారి కోవిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రధానాంశాలు:రేపు మరోసారి యశోద హాస్పిటల్‌కు వెళ్లనున్న కేసీఆర్కరోనాపై రెండ్రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశంలాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశంకరోనా పాజిటివ్‌తో కొద్దిరోజులుగా హోమ్ ఐసోలేషన‌లో ఉంటూ చికిత్స పొందుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి మంగళవారం మరోసారి యశోద ఆస్పత్రికి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కరోనా నిర్ధారణ అయ్యాక ఈ నెల 21 తొలిసారి హాస్పిటల్‌‌కు వచ్చిన కేసీఆర్ సిటీ స్కాన్‌తో పాటు ఇతర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం నేరుగా ఫామ్ హౌస్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడటంతో ఆయనకు మరోసారి కోవిడ్ టెస్ట్‌తో పాటు ఇతర పరీక్షలు చేయనున్నారు.

Also Read: మెట్రో నెత్తిన కరోనా పిడుగు… సగానికి పైగా తగ్గిపోయిన ప్రయాణికులు

ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్‌కు రానున్నట్లు సమాచారం. ఆయనకు కరోనా నెగిటివ్ రాగానే రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై బుధ, గురువారాల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశముంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తెలంగాణలో లాక్‌డౌన్‌పై ప్రచారం ఊపందుకుంది. దీనిపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ పెట్టాలా.., లేక రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలా? అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Also Read: హైదరాబాద్‌లో నలుగురు మహిళల మిస్సింగ్… అంతుబట్టని కారణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పదో తరగతిలోనే ప్రేమ లేఖలు.. వంతులు పెట్టుకొని మరీ వెళ్లేవాళ్లం.. ఇవీ చిరంజీవి సీక్రెట్స్

Mon Apr 26 , 2021
చిరంజీవితో పాఠశాల రోజుల నుంచి కాలేజీ వరకు కలిసి చదువుకున్న డాక్టర్ సత్య ప్రసాద్.. మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ చిన్ననాటి సంగతులను బయటపెట్టారు. చిరంజీవికి వచ్చిన లవ్ లెటర్స్ గురించి చెప్పారు.