YS Jagan కు కేసీఆర్ సర్కార్ ఝలక్.. TS కేబినెట్‌ సంచలన నిర్ణయం

Krishna River Projects: ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్‌కు తెలిపింది.

ప్రధానాంశాలు:కృష్ణా నదిపై కొత్త ఆనకట్టతెలంగాణ కేబినెట్ ఆమోదంఏపీ అక్రమ ప్రాజెక్టుల వల్లేనని వెల్లడిTelangana Cabinet: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి మండలి ప్రగతి భవన్ లో సమావేశమైంది. పలు అంశాలమీద సుధీర్ఘంగా చర్చించిన కేబినెట్ అందుకు సంబంధించి ఈ కింది నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్డీఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసన తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్‌కు తెలిపింది. ఎన్‌జీటీతో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని కేబినెట్ తీవ్రంగా ఖంఢించింది.

ఇక్కడ కొత్త ప్రాజెక్టు
జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద.. గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో.. బ్యారేజీ (ఆనకట్ట) నిర్మించి 60-70 టీఎంసీల వరద నీటిని పైపు లైను ద్వారా తరలించాలని నిర్ణయించింది. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణయించింది.

నూతనంగా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్
జీహెచ్ఎమ్‌సీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని, దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించిన కేబినెట్ రాష్ట్రానికి మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నూతనంగా మంజూరు చేసింది. చెస్ట్ హాస్పటల్ ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండవది, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆరార్ మధ్యలో మూడవది. టిమ్స్‌ను కలిపి మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.

నోరు జారిన ఈటల రాజేందర్, పక్కనే బండి సంజయ్ షాక్! ఆ వెంటనే సరి చేసుకొని..
మహిళ వెనకే ఫాలో అయిన వ్యక్తి.. అంతలోనే షాకింగ్ సీన్, సీసీటీవీ కెమెరాలో మొత్తం రికార్డు Telangana Unlock: తెలంగాణలో అన్‌లాక్ గైడ్‌లైన్స్ ఇవే.. ఇది పాటించకపోతే అంతే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Kodali Nani: సన్నబియ్యం సన్నాసి, నల్లగడ్డం గాడిద, నీ **మొగుడు మంత్రి: కొడాలి నానిపై దివ్యవాణి తిట్ల పురాణం

Sat Jun 19 , 2021
చంద్రబాబుకి ఉన్న రాజసంలో ఆరోవంతు కూడా మంత్రి కొడాలి నానికి లేదని అన్నారు సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి. తాజాగా లోకేష్ బాబుపై కొడాలి నాని చేసి తీవ్ర వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తిట్ల పురాణం అందుకుంది దివ్యవాణి.