తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ పంట వేస్తే రైతులకు ఎకరాకు రూ.26 వేలు

Oil Prices: పామాయిల్ సాగు కోసం అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్‌తో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది.

భారత దేశంలో వంట నూనె వినియోగం ఏటికేడూ పెరుగుతూనే ఉంది. నూనె గింజల ఉత్పత్తి మందగించడంతో వంట నూనె ధరలు ఇప్పటికే రెట్టింపు దాటిన సంగతి తెలిసిందే. దేశంలో నూనె అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే మనం విదేశాల నుంచి పామాయిల్ గింజలను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ఈ సమస్య తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. రైతులను వంట నూనెకు ఉపయోగపడే పంటలను పండించే దిశగా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహకాలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులకు శుభవార్త చెప్పింది.

తెలంగాణలో పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలను అందించాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. పామాయిల్ సాగు కోసం అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్‌తో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది. 2022-23 ఏడాదికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు సబ్సిడీ ఇవ్వనున్నారు.

పామాయిల్ సాగు చేసే రైతులకు ఎకరానికి మొదటి ఏడాది.. రూ.26 వేలు, రెండో ఏడాది ఎకరానికి రూ.5 వేలు, మూడో ఏడాది ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని కేబినెట్ నిర్ణయించింది. పామాయిల్ పంట పండించే విధానంపై అధ్యయనం బృందాన్ని, కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా దేశాలకు పంపించాలని నిర్ణయించింది. ఈ బృందంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉంటారు. ప్రస్తుతం భారత్ ఆ దేశాల నుంచి పామాయిల్‌ను ఎక్కువగా కొంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కన్వార్ యాత్రపై పునరాలోచిస్తారా.. మేమే నిర్ణయం తీసుకోవాలా: యూపీకి సుప్రీం అల్టిమేటం

Fri Jul 16 , 2021
కరోనా మూడో దశ వ్యాప్తి ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే.. యూపీ ప్రభుత్వం కన్వార్ యాత్రకు అనుమతించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.