Paralympics ఆరంభోత్సవం.. ఆఖర్లో మారిన భారత పతాకధారి

పారాలింపిక్స్ ఆరంభోత్సవంలో భారత పతాకధారిగా టేక్ చంద్ వ్యవహరించాడు. మరియప్పన్ తంగవేలు తొలుత పతాకధారిగా ఎంపికైనా.. అతని పక్కన కూర్చున్న వ్యక్తికి

ప్రధానాంశాలు:టోక్యో వేదికగా పారాలింపిక్స్ ప్రారంభంఆరంభోత్సవంలో భారత పతాకధారిగా టేక్ చంద్భారత్ నుంచి 54 మంది అథ్లెట్లు ప్రాతినిథ్యంఈసారి కొత్తగా బ్యాడ్మింటన్, తైక్వాండో పోటీలు టోక్యో వేదికగా పారాలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 4,403 మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో పోటీపడుతుండగా.. భారత్ నుంచి 54 మంది క్రీడాకారులు అక్కడికి వెళ్లారు. జపాన్ జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ ఆరంభోత్సవ వేడుకల్లో భారత పతాకధారిగా షాట్‌ ఫుట్ ఆటగాడు టేక్ చంద్ వ్యవహరించాడు.

వాస్తవానికి ఆరంభ వేడుకల్లో భారత పతాకధారిగా మరియప్పన్ తంగవేలుని ఎంపిక చేశారు. కానీ.. తమిళనాడుకి చెందిన ఈ హైజంప్ క్రీడాకారుడు.. ఆఖర్లో ఊహించని విధంగా ఆరంభోత్సవానికి దూరమయ్యాడు. తంగవేలు టోక్యోకి వెళ్లే సమయంలో విమానంలో అతని పక్కన కూర్చున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తంగవేలుని క్వారంటైన్‌లో ఉంచారు. దాంతో.. టేక్ చంద్‌కి పతాకధారిగా అవకాశం లభించింది.

ఆరంభోత్సవంలో చక్రాల కుర్చీలో కూర్చుని త్రివర్ణ పతాకంతో భారత్ బృందాన్ని టేక్ చంద్ నడిపించాడు. ఈ పారాలింపిక్స్‌లో 163 దేశాల నుంచి అథ్లెట్లు పోటీపడుతుండగా.. మొత్తం 22 క్రీడల్లో 540 పతక ఈ వెంట్లు ఉన్నాయి. ఈసారి కొత్తగా బ్యాడ్మింటన్, తైక్వాండో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

బంగాళదుంపల్ని ఇలా తింటే ఎంతో ఆరోగ్యమట..

Wed Aug 25 , 2021
మనం తీసుకునే ఆహారం, మనం అనుసరించే పద్ధతులు ఆధారంగా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఆరోగ్యం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేది అయ్యి ఉండాలి.