7000 ఎంఏహెచ్ బ్యాటరీతో కొత్త ఫోన్.. ధర రూ.12 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో మనదేశంలో త్వరలో టెక్నో పోవా 2 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉండటం విశేషం.

ప్రధానాంశాలు:రూ.12 వేల ధరతోనే టెక్నో కొత్త ఫోన్టెక్నో పోవా 2 వచ్చేస్తుందిటెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన టీజర్‌ను కంపెనీ సీఈవో అరిజీత్ తలపాత్రా విడుదల చేశారు. ట్వీటర్‌లో ఈ టీజర్ విడుదల అయింది. దీని బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్‌గా ఉంది.

టెక్నో పోవా 2 ధర(అంచనా)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 7,990 ఫిలిప్పీన్స్ పెసోలుగా(సుమారు రూ.12,000) నిర్ణయించారు. పోలార్ సిల్వర్ రంగులో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో కూడా ఇదే రేంజ్‌లో దీని ధర ఉండే అవకాశం ఉంది.
మోటో జీ60ఎస్ ధర, ఫీచర్లు లీక్.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరా!
టెక్నో పోవా 2 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
రూ.8 వేలలోపే స్మార్ట్‌ఫోన్.. లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్!
Tecno Pova 2 స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek Helio G85డిస్_ప్లే6.9 inches (17.53 cm)స్టోరేజ్_ఫైల్64 GBకెమెరాా48 MP + 2 MP + 2 MP + 2 MPబ్యాటరీ7000 mAhprice_in_india12290ర్యామ్4 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చీరకట్టు.. లంగా జాకెట్టు ధరించి.. అభిమాలనకు కనువిందు కలిగిస్తున్న బన్నీ భార్య, కూతురు

Tue Jul 13 , 2021
ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ప్రమోషన్ పొంది తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యారు అల్లు అర్జున్. సినిమాల ద్వారా బన్నీ వినోదాన్ని పంచుతుంటే.. ఆయన భార్య స్నేహా.. సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌ని అలరిస్తుంటారు. తాజాగా ఆమె ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేశారు.