వెనక 64 మెగాపిక్సెల్, ముందు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. కొత్త ఫోన్ వచ్చేస్తుంది!

టెక్నో తన కొత్త కామోన్ 17 సిరీస్ ఫోన్లను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రైమ్ డే సేల్‌లో వీటి సేల్ ప్రారంభం కానుంది.

ప్రధానాంశాలు:ధర రూ.15 వేల నుంచి ప్రారంభం అయ్యే అవకాశంస్పెసిఫికేషన్లు కూడా రివీల్టెక్నో కామోనో 17 సిరీస్ ఫోన్లు మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది దీనికి సంబంధించిన ల్యాండింగ్ పేజీని కూడా అమెజాన్‌లో చూడవచ్చు. అయితే ఇవి సరిగ్గా ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు. దీనికి సంబంధించిన సేల్ మాత్రం ప్రైమ్ డేస్‌లో జరగనున్నట్లు అమెజాన్ తెలిపింది.

టెక్నో ఇప్పటికే కామోన్ 17 సిరీస్ ఫోన్లను ఆఫ్రికాలో లాంచ్ చేసింది. కాబట్టి వీటి స్పెసిఫికేషన్ల విషయంలో ఎటువంటి రహస్యం లేదు. టెక్నో కామోన్ 17 ప్రోలో వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 48 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.

టెక్నో కామోన్ 17 సిరీస్ ధర(అంచనా)
టెక్నో కామోన్ 17 ప్రో ధరను 1,25,000 నైజీరియన్ నైరాలుగా(సుమారు రూ.24,100) నిర్ణయించారు. కామోన్ 17 ధర 74,000 నైజీరియన్ నైరాలుగా(సుమారు రూ.14,200) ఉంది. కాబట్టి మనదేశంలో వీటి ధర రూ.15,000 రేంజ్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఇది కదా అసలైన స్మార్ట్ ఫోన్ అంటే.. సూపర్ మొబైల్ లాంచ్ చేసిన క్వాల్‌కాం!
టెక్నో కామోన్ 17 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.55 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90 శాతంగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

టెక్నో కామోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో కామోన్ 17 ప్రో పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌లు కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 48 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.89 సెంటీమీటర్లుగా ఉంది.
శాంసంగ్ కొత్త ఫోన్ ఫీచర్లు లీక్.. ధర బడ్జెట్‌లోనే ఉండే అవకాశం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

WI vs AUS 1st T20లో కంగారూలకి పంచ్... రసెల్ విధ్వంసం

Sat Jul 10 , 2021
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడాలని ఆశిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు.. వెస్టిండీస్‌ టూర్‌కి దూరంగా ఉన్నారు. దాంతో.. ఫస్ట్ టీ20 మ్యాచ్‌లోనే ఆ ఆటగాళ్లు లేని లోటు టీమ్‌లో స్పష్టంగా కనబడింది.