MS Dhoni రికార్డ్ బ్రేక్.. విరాట్ కోహ్లీనే టాప్

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2014తో నెలకొల్పిన రికార్డ్‌ని తాజాగా విరాట్ కోహ్లీ కనుమరుగు చేశాడు. బ్యాటింగ్‌లో ఇప్పటికే అరుదైన ఘనతల్ని సాధించిన కోహ్లి..

ప్రధానాంశాలు:భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం ఫైనల్ ప్రారంభంకెప్టెన్‌గా టెస్టుల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్మహేంద్రసింగ్ ధోనీ రికార్డ్ కనుమరుగుఓవరాల్‌గా టాప్‌లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరుదైన రికార్డ్‌ నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో సౌథాంప్టన్ వేదికగా శనివారం ప్రారంభమైన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడుతున్న విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లకి కెప్టెన్సీ వహించిన క్రికెటర్ నిలిచాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోనీ 60 టెస్టులకి కెప్టెన్సీ వహించాడు.

ధోనీ రిటైర్మెంట్ తర్వాత టెస్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీకి తాజాగా ఫైనల్ మ్యాచ్ కెప్టెన్‌గా 61వది. మొత్తంగా.. క్రికెట్ ప్రపంచంలో అత్యధిక టెస్టులకి కెప్టెన్సీ వహించిన క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఉన్నాడు. గ్రేమ్ స్మిత్ 109 టెస్టులకి కెప్టెన్సీ వహించగా.. అతని తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ 93 టెస్టులతో ఉన్నాడు.

ఆసియా పరంగా చూస్తే మాత్రం విరాట్ కోహ్లీనే టాప్. కోహ్లీ, ధోనీ తర్వాత స్థానాల్లో శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ 56 టెస్టులతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Kiara Advani: శంకర్-రామ్ చరణ్ మూవీ క్రేజీ అప్డేట్.. హీరోయిన్‌గా మళ్లీ ఆమె.! భయపెడుతున్న సెంటిమెంట్

Sat Jun 19 , 2021
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో హీరో, దర్శకుడితో పాటు హీరోయిన్ పాత్ర చాలా కీలకం. పైగా శంకర్ లాంటి పాన్ ఇండియా దర్శకుడు సినిమాలో కథానాయిక పాత్రకి మంచి స్కోప్ ఉంటూ వస్తోంది. అయితే రామ్ చరణ్- శంకర్ కాంబో మూవీలో హీరోయిన్ ఎవరనే చర్చ నడుస్తోంది.