పిట్టకథలు మానేస్తే బెటర్.! జగన్ క్యాబినెట్‌లో కీలక మంత్రికి చురకలు

ఏపీ ఆర్థిక శాఖలో వేల కోట్ల అవకతవకలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణలు హీట్ రాజేస్తున్నాయి. అప్పులన్నీ అసంక్షేమానికి వినియోగిస్తున్నామని చెప్పడం పచ్చి అబద్ధమని టీడీపీ నేత ఖండించారు.

ఏపీ ఆర్థిక శాఖలో అతి పెద్ద కుంభకోణం జరిగిందని.. రూ.41 వేల కోట్ల ఖర్చుకు సరైన పద్దులు లేవంటూ ప్రతిపక్ష టీడీపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ప్రొసీజర్‌ను పక్కన బెట్టి డబ్బులు ఎలా ఖర్చు చేస్తారంటూ ప్రశ్నలు సంధించింది. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించింది. అదే విషయమై సీఎం జగన్ క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని టార్గెట్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌ బాబు. మంత్రి బుగ్గన తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

మంత్రి బుగ్గన కట్టుకథలు, పిట్టకథలు చెప్పడం మానేసి ఏ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి ఎంత జరిగాయో శ్వేతపత్రం విడుదల చేయాలని అశోక్ డిమాండ్ చేశారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వం గ్యారెంటీ వివరానలు కూడా బహిర్గతం చేయాలన్నారు. మద్యం, పెట్రోల్, డీజిల్‌ నుంచి రాష్ట్రానికి ఎన్నడూ లేనంత ఆదాయం వస్తోందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ దుయ్యబట్టారు.

ఆర్థిక మంత్రి వాస్తవాలు చెప్పకుండా సీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని తప్పుబడుతున్నారని.. అది తప్పైతే రద్దు చేయకుండా ఎందుకు వినియోగిస్తున్నారని అశోక్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా అంటూ దబాయింపులు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పులన్నీ సంక్షేమం కోసమే చేశామని ప్రభుత్వం చెబుతోందని.. టీడీపీ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. రాజకీయ విమర్శలతో టీడీపీని.. రాష్ట్ర ప్రజలను కట్టడి చేయగలరేమో కానీ కేంద్రాన్ని, కాగ్‌ని కాదంటూ విమర్శించారు.

Also Read: చంద్రబాబుకి అల్లుడి సెగ.. నెక్స్ట్ సీఎం ఆయనే.! అధినేత ఎదుటే అతి ఉత్సాహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కేంద్రంపై నాగబాబు చురకలు.. అప్డేట్ అవ్వండి సార్.. మెగాబ్రదర్‌పై ట్రోల్స్

Wed Jul 14 , 2021
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. నాగబాబుపై జరిగే ట్రోలింగ్, దానికి ఆయన ఇచ్చే కౌంటర్లు ఎప్పుడూ వివాదాస్పదంగానే మారుతుంటాయి. ఈ మధ్య నాగబాబు సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటున్నారు.