లోకేష్‌కు షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు.. పేటీఎం కుక్కలు, జఫ్ఫాస్ అంటూ ఓ రేంజ్‌లో..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌కు ఫేక్ ట్వీట్ల బెడద తప్పడం లేదు. తమ ప్రత్యర్థులు ఫేక్ ట్వీట్లు సృష్టించి ప్రజల్లోకి తీసుకెళ్తుండటం లోకేష్‌కు ఇబ్బందికరంగా మారింది. తాజాగా, కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై లోకేష్‌ను టార్గెట్ చేస్తూ ఫేక్ ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీంతో మార్ఫింగ్ ట్వీట్లతో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయారు. ఈ మేరకు ఆదివారం లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.

‘‘జగన్ రెడ్డి వేసే 5 రూపాయిల ముష్టి కోసం ఎంత కన్నా దిగజరుతాయి పేటీఎం కుక్కలు. మీ నాయకుడి దగ్గర సరుకు లేదు.. ఇక మీ బతుకులు ఫేక్ ట్వీట్లు వేసుకొని సంబరపడటమే. ప్రజలకు మాస్క్ కూడా ఇవ్వలేని అసమర్థుడు. పేరాసిట్మాల్, బ్లీచింగ్‌తో కరోనా చచ్చిపోతుంది అన్న మీ జగరోనా మాటలు విని ప్రపంచమంతా నవ్వుకుంది. ఇప్పటికైనా ఫేక్ ట్వీట్లు మాని ప్రజల ప్రాణాలు కాపాడమని మీ జగరోనాకి గడ్డి పెట్టండి జఫ్ఫాస్.’’ అని లోకేష్ విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్ నిర్ణయాన్ని లోకేష్ వ్యతిరేకిస్తున్నట్లు ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ట్వీట్‌లో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం మూర్ఖత్వానికి పరకాష్ట అని, రూ. 400 ఖర్చు చేసి ప్రజలను వ్యాక్సిన్ కొనుగోలు చేయనివ్వకుండా వారిని సోమరిపోతులను చేస్తున్నాడని లోకేష్ వ్యాఖ్యానించినట్టు పేర్కొన్నారు. దీనిపై లోకేష్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

‘ఆ సమయంలో నా గుండె పగిలిపోయింది.. కన్నీళ్లు ఆగలేదు’ థమన్ భావోద్వేగ ట్వీట్..

Sun Apr 25 , 2021
తెలుగు సినీ సంగీత దర్శకుల్లో టాప్‌లో ఉన్నాడు ఎస్.ఎస్ థమన్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న థమన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే సోషల్‌మీడియాలో ఓ వీడియో థమన్‌ని ఎంతో భావోద్వేగానికి గురి చేసిందట. ఈ విషయాన్ని అతను ట్వీట్ ద్వారా తెలిపాడు.