ఏపీలో రూ.4వేల కోట్ల కుంభకోణం, ఆ ఇద్దరు మంత్రులు.. టీడీపీ సంచలనం

రూ. 4 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇందులో జగన్ వాటా ఎంతో తెలపాలని.. ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కడం సిగ్గుగా లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రధానాంశాలు:టీడీపీ సంచలన ఆరోపణలుఏపీలో బియ్యం కుంభకోణంరూ.4వేల కోట్లు దోచేశారుఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణం జరిగితే దర్యాప్తు ఏదంటూ టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి నాసిరకం బియ్యమిస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలకిచ్చే బియ్యం విషయంలో కూడా జగన్ ప్రభుత్వం కక్కర్తికి పాల్పపడుతోందన్నారు. రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకిచ్చి తద్వారా వచ్చే నాణ్యమైన బియ్యాన్ని పేదలకివ్వాల్సి ఉంటే మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాధరాజు, కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డిలు ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని రూ. 4 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.

మళ్లీ అదే బియ్యాన్ని నాసిరకం బియ్యంగా రీసైక్లింగ్ చేసి పేద ప్రజలకు పంపిణీ చేయడం అన్యాయమన్నారు రాజు. కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని మైలవరంలో ఈ సంఘటన బయటపడిందన్నాు. ఇందులో జగన్ వాటా ఎంతో తెలపాలని.. ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కడం సిగ్గుగా లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 60 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.3 వేల కోట్లు బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన నాణ్యమైన ధాన్యాన్ని కేజీ రూ.40 బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారన్నారు. ఈ అవినీతికి పాల్పడుతున్న మంత్రులను, కార్పొరేషన్ ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని రాజు డిమాండ్ చేశారు.

జగన్ రైతు వ్యతిరేకి అన్నారు రాజు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి బెంగళూరులో, హైదరాబాద్‌లో, పులివెందులలో, ఇడుపులపాయిలో, తాడేపల్లిలో ఇళ్లు ఉన్నాయి.. కానీ పేద రైతుకు నిలువ నీడ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబునాయుడుకు ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పించారు కాబట్టి ఆయనకు ప్రభుత్వ అవినీతిని, వైసీపీ నాయకులు చేసే తప్పుల్ని ప్రశ్నించే హక్కుందన్నారు. వైసీపీ నాయకులు తప్పుడు ప్రకటనలు మానుకోవాలని.. వారు పూటకో మాట మాట్లాడుడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో రైతుల తరపున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్.. వచ్చే వారమే ప్రీ-బుకింగ్స్!

Sat Aug 28 , 2021
జియో, గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్స్ట్ అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ మనదేశంలో వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి.