బిల్డప్ బాబాయ్‌ జగన్.. పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ. 600 కోట్లు.. టీడీపీ సంచలనం!

జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపు ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఎడ్ల బండికి కారును తాడుతో కట్టి పట్టణంలో తిప్పారు. అలాగే కారుకు తాళ్లను కట్టి లాగుతూ తమ నిరసనను తెలియజేశారు. ఇక, పెరిగిన ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల నుంచి.. నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది.

ఈ సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంద్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా పెట్రోల్, డీజిల్ పెరిగాయని గగ్గోలు పెట్టారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటి ధరలను భారీగా పెంచారని దుయ్యబట్టారు. రెండేళ్లలో ఏపీలో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలపై రూ. 1,000 కోట్లకు పైగా టాక్స్ వసూలు చేశారని చినరాజప్ప ఆరోపించారు. దీంతో ప్రజలపై పన్నుల భారం పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. తెలుగు దేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ‘బిడ్డప్ బాబాయ్’తో పోలుస్తూ సెటైర్లు వేసింది. ‘‘ఈ బిల్డప్ బాబాయ్ పెట్రోల్ ధరల బాదుడుతో బైక్స్ సైకిళ్లు అయిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై రోడ్ సెస్ పేరిట రూ. 600 కోట్లు వసూలు చేసిన జగన్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో ఒక్క రోడ్డు గుంతయినా పూడ్చారా?’’ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రాజకీయాల్లో NTR సక్సెస్‌కు కారణం అదే.. జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు

Sun Aug 29 , 2021
జపాన్‌, చైనా దేశాలు పరాయి భాషల మోజులో పడలేదు. ఆ దేశాలు తమ భాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థాయికి చేరుకోగలుగుతున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.