తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు.. ఆగస్టు 28 నుంచి

వ్యవహారి భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. విదేశాల్లోని తెలుగువారు ఈ వేడులకు ఘనంగా నిర్వహిస్తారు.

ప్రధానాంశాలు:ఆగస్టు 29న తెలుగు భాషాదినోత్సవం.రెండు రోజుల వేడుకలను నిర్వహిస్తోన్న తానా.లబ్దప్రతిష్టుల జీవిత ప్రస్థానాల ఆవిష్కరణ. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం ఆధ్వర్యంలో వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో విర్చువల్‌గా ఆగష్టు 28, 29 తేదీలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు.

ఈ వేడుకలలో పశ్చిమ బెంగాల్ మహిళా, శిశు అభివృద్ధి, మంత్రి, తెలుగు సంతతికి చెందిన డాక్టర్. శశి పిల్లలమర్రి (పంజా) ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రత్యేక అతిథిగా బెంగాల్ డీజీపీ డాక్టర్ బొప్పూడి నాగ రమేశ్, ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి విశిష్ఠ అతిథిగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. భరణి రచించిన ‘ఎందరో మహానుభావులు’ అనే పుస్తకం ఆంగ్లానువాదాన్ని డాక్టర్ పంజా ఆవిష్కరిస్తారు. ఆదివారం నాడు ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ వెంపటి, సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్‌ లిఫ్టింగ్‌ కాంస్య పతక విజేతా, ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరణం మల్లీశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎంతోమంది లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తల జీవిత ప్రస్థానాలను ఈ సభలో వారి కుటుంబసభ్యులే ఆవిష్కరించడం సాహితీ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టమన్నారు. శనివారం నాడు డాక్టర్ తుమ్మల సీతారామమూర్తి చౌదరి, డాక్టర్ రాయప్రోలు సుబ్బారావు, డాక్టర్ కొండవీటి వేంకట కవి, డాక్టర్ ముళ్ళపూడి వెంకటరమణ, డాక్టర్ గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీషా, పద్మభూషణ్ డాక్టర్ గుర్రం జాషువా, పద్మభూషణ్ డాక్టర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి కుటుంబసభ్యులు ఆవిష్కరిస్తారు.

ఆదివారం నాడు కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి, పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న, గురజాడ అప్పారావు, రాష్ట్రేందు డాక్టర్ గుంటూరు శేషేంద్రశర్మ, పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు, పద్మభూషణ్ డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ రావూరి భరద్వాజ, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్ కుటుంబసభ్యులు పాల్గొని ఎన్నో అసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారు.

ఆగష్టు 28 నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 లకు ప్రారంభమవుతందని ఈ క్రింది వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తెలియజేశారు.

1. TANA TV Channel – in YuppTV
2. Facebook: https://www.facebook.com/tana.org
3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
4. www.youtube.com/tvasiatelugu
5. www.youtube.com/manatv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కాబూల్ విమానాశ్రయం తక్షణమే వీడండి.. భారీ ఉగ్రదాడికి కుట్ర: అమెరికా హెచ్చరిక

Thu Aug 26 , 2021
అధ్యక్షుడు జో బిడెన్ నిర్దేశించిన గడువు ఆగస్టు 31 వరకు కాబూల్ విమానాశ్రయాన్ని నిర్వహించడం మాత్రమే అమెరికా బాధ్యత అని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.