తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఆపేయండి.! కేంద్రానికి తమిళ సీఎం షాకింగ్ లేఖ

ఆక్సిజన్ కేటాయింపులపై తమిళనాడు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసింది. పెరంబూర్ నుంచి ఆక్సిజన్ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం పళనిస్వామి లేఖ రాశారు.

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆక్సిజన్‌కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆక్సిజన్ కేటాయింపులు చేసింది. అయితే ఆ కేటాయింపులపై తమిళనాడు భిన్న స్వరం అందుకుంది. తమ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతనే మిగిలిన రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయగలమని.. పెరంబూరు ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన ఆక్సిజన్‌ను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు సీఎం ఎడప్పాడి పళని స్వామి కేంద్రానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.

వాస్తవానికి తమ రాష్ట్రంలో 450 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 400 టన్నుల ఉత్పత్తి సామర్థ్యమే ఉందని పళనిస్వామి తెలిపారు. తమిళనాడుకు కేవలం 220 టన్నుల ఆక్సిజన్ కేటాయింపులు చేశారని.. అది వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర నిర్ణయం తీసుకుందని ఆయన తప్పుబట్టారు. గతంలో కరోనా వేవ్ సమయంలో 58 వేల కేసులు ఉన్నాయని.. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 310 టన్నుల ఆక్సిజన్ ఖర్చవుతోందని.. కానీ కేంద్రం కేవలం 220 టన్నులు మాత్రమే కేటాయించిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో చెన్నై సమీపంలోని పెరంబూర్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయింపులను రద్దు చేయాలని ఆయన కోరారు. కరోనా తక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లోనూ ఉక్కు పరిశ్రమలు ఉన్నాయని.. అక్కడ ఉత్పత్రి అవుతున్న మెడికల్ ఆక్సిజన్‌ను ఆయా రాష్ట్రాలు వినియోగించుకుంటే పెరంబూర్ నుంచి కేటాయించిన ఆక్సిజన్‌ను చెన్నైలోని ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందని ఆయన కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. లేకుంటే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన విన్నవించారు. అయితే కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!!

Also Read: ఢిల్లీకి గుడ్‌న్యూస్.. బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.50 వేలకే అదిరిపోయే కొత్త కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు.. ఆఫర్ పూర్తి వివరాలివే!

Sun Apr 25 , 2021
మీరు కారు కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ డౌన్ పేమెంట్‌తోనే నచ్చిన కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు.