ఈక్యూ & ఐక్యూ లను పక్కన పెట్టండి; ఈరోజు ఈ డీక్యూ టెస్ట్‌తో మీ జీర్ణ ప్రక్రియలు గురించి మరింత తెలుసుకోండి

ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవడం పెద్ద కష్టం కాదు; ఇంకా, మునుపటి కంటే ఇప్పుడు ఇది మరింత సులభం. మనం తీసుకునే ఆహారంలో కొంచెం మార్పులు చేయడంతో దీనిని చెయ్యచ్చు.

మీరు మరియు మీ ప్రియమైన వారు ఆరోగ్యంగా ఉన్నారని ఎలా తెలుస్తుంది? ప్రస్తుత-కాలపు ఇండికేటర్స్ బాగున్నాయి. ఉదాహరణకు, బరువు తగ్గుతున్నారో లేదో తెలుసుకోవడానికి వెయిటింగ్ మెషిన్ ఉపయోగపడుతుంది; ఎన్ని గంటలు పడుకుంటున్నామో, హార్ట్ రేట్ ఎలా ఉందో, ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఫిట్‌నెస్ బాండ్స్ ఉపయోగపడతాయి. ఫిట్‌నెస్ విషయంలో మీ ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి, అలానే మంచి ఆరోగ్యాన్ని సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ ఇండికేటర్స్ చాలా బాగా సహాయపడతాయి.

అదే విధంగా, ఎమోషనల్ కోషియంట్ (ఈక్యూ) మరియు ఇంటలిజెన్స్ కోషియంట్ (ఐక్యూ) టెస్టులు ఏకాగ్రతను పెంచే ఆటలు, పజిల్స్, బాగా వినడం, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం ద్వారా మీ లక్ష్యాలను ట్రాక్ చెయ్యడానికి మరియు వాటిని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఇవి మీ జీవిత లక్ష్యాలను చేరుకోవడంలో ఎంతగానో సహాయపడతాయి.

ఐక్యూ మరియు ఈక్యూ లానే, మీ డైజెస్టివ్ కోషియంట్ (డీక్యూ) గురించి కూడా తెలుసుకోవచ్చని మీకు తెలుసా? మీరు తీసుకునే ఆహారం, అలవాట్లు మరియు మీ జీవన విధానాలపై 100 మార్కులకు జరిగే ఈ 2 నిమిషాల టెస్ట్‌తో మీ జీర్ణ ప్రక్రియ ఎలా ఉందో మరియు దాని గురించి మరింత తెలుసుకోవచ్చు.

జీర్ణం చేసుకోవడం ఎందుకు అత్యంత అవసరం అని అనుకుంటున్నారా, ఇప్పుడు దాని గురించి తెలుసుకోండి – తీసుకున్న ఆహారాన్ని న్యూట్రియంట్స్‌గా విడగొడుతుంది, వీటిని శరీరం శక్తి కోసం, గ్రోత్ మరియు కణాలను బాగు చెయ్యడానికి ఉపయోగించుకుంటుంది. అలసటతో ఉన్న ఆధునిక జీవనశైలి, కదలకుండా పనులు చేసుకునే లైఫ్‌స్టైల్స్ మరియు చెడు ఆహారపు అలవాట్లు మన సహజ జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇటువంటి చికాకును తొలగించడానికి మంచి జీర్ణ వ్యవస్థ ఎంతగానో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే పోషకాలు ఉన్న ఆహారంతో దీనిని సాధించవచ్చు. వాస్తవానికి, ఈ అధ్యయనం జీర్ణ క్రియకు సహాయపడటంలో ఫైబర్ పాత్రను చూపించే అనేక అంశాలతో ఉంది. అరగని ఆహారాన్ని ఫైబర్ విడగొట్టి ప్రేగు కదలికలు బాగుండేలా చేస్తుంది, దీనితో ఇది మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ కాలం హాయిగా, పూర్తి సంతోషంగా ఉండేలా చేస్తుంది.

ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవడం పెద్ద కష్టం కాదు; ఇంకా, మునుపటి కంటే ఇప్పుడు ఇది మరింత సులభం. మనం తీసుకునే ఆహారంలో కొంచెం మార్పులు చేయడంతో దీనిని చెయ్యచ్చు. ఉదాహరణకు, మనం ఉపయోగించే పిండి. చపాతీలు చెయ్యడానికి సాధారణంగా ఉపయోగించే పిండి బదులు మల్టీ గ్రెయిన్ పిండి వాడితే మంచి జీర్ణ ప్రక్రియకు అవసరమయ్యే ఫైబర్ అందుతుంది. మల్టీ గ్రెయిన్ చపాతీలలో ఆరు రకాల ధాన్యాలు ఉంటాయి, ఇందులో గోధుమలు, సోయా, శనగలు, ఓట్, మొక్కజొన్న మరియు సీలియం ఊక ఉన్నాయి. మల్టీ గ్రెయిన్ గోధుమపిండితో చేసిన 3 చపాతీలతో, మనకు ప్రతీరోజు అవసరమయ్యే ఫైబర్‌లో 25% అందుతుందని మీకు తెలుసా?

అందుకే ఈరోజే మీ డీక్యూ తెలుసుకోండి. మన కడుపు చెప్పేది వినడానికి సరైన సమయం అంటూ ఉండదు, ఎందుకంటే మన కడుపు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాము. ఎల్లప్పుడూ.

డిస్‌క్లైమర్: ఈ ఆర్టికల్ ఆశీర్వాద్ అట్టా విత్ మల్టీగ్రెయిన్స్ తరపున టైమ్స్ ఇంటర్నెట్ స్పాట్‌లైట్ టీంచే వ్రాయబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గోధుమలు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందా..

Wed Sep 15 , 2021
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన జీవనశైలి వలన కూడా అధిక కొవ్వు కలిగే ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అధిక కొవ్వును కలిగి ఉండడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.