నటిగానే కాకుండా ఇకపై అలా.. కొత్త అవతారమెత్తిన హీరోయిన్ తాప్సీ

తాప్సీ పన్ను ఇప్పుడు ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో దూసుకుపోతోన్నారు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. అలాంటి తాప్సీ ఇప్పుడు నిర్మాతగానూ మారుతున్నారు. ఈ మేరకు కాస్త ఎమోషనల్ అయ్యారు.

ప్రధానాంశాలు:నటిగానే కాకుండా ఇకపై అలాకొత్త అవతారమెత్తిన హీరోయిన్ తాప్సీఅవుట్ సైడర్స్ ఫిల్మ్స్ అంటూ కొత్త బ్యానర్తాప్సీ పన్ను ఇప్పుడు ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో దూసుకుపోతోన్నారు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. అలాంటి తాప్సీ ఇప్పుడు నిర్మాతగానూ మారుతున్నారు. ఈ మేరకు కాస్త ఎమోషనల్ అయ్యారు. అయితే బాలీవుడ్‌లో అవుట్ సైడర్స్, నెపోటిజం అనే పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. వారసత్వ హీరో, హీరోయిన్లదే అక్కడ రాజ్యం. బయటి నుంచి వచ్చిన వాళ్లను తొక్కేస్తారు.. సరిగ్గా చూడరు, అవకాశాలు ఇవ్వరు అని ప్రచారం జరగుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆ పేరును తన కొత్త ప్రొడక్షన్ కంపెనీకి పేరుగా పెట్టేసుకున్నారు.

ప్రస్తుతం తాప్సీ హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్నారు. ఈ మధ్యే హసీన్ దిల్రూబ అనే చిత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా తాప్సీ తాను కొత్త అవతారాన్ని ఎత్త బోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన కొత్త ప్రొడక్షన్ కంపెనీ గురించిచెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి వచ్చి గత ఏడాది ఓ దశాబ్దం గడిచింది. అసలైతే ఈ ప్రయాణాన్ని నేను ఇంత వరకు కొనసాగిస్తానని అనుకోలేదు.. కానీ ఈత నేర్చుకున్నాను.. ఇంత వరకు వచ్చాను..పబ్లిక్ ఫిగర్ అవుతానని ఎప్పుడూ కూడా కలగనలేదు.. నా పనితనం మీద నమ్మకం ఉంచి నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ఎప్పుడూ రుణ పడి ఉంటాను.

ఇక ఇప్పుడు నేను వెనుదిరిగి ఇచ్చే సమయం వచ్చింది. గొప్ప బాధ్యతలను భుజాన వేసుకున్నప్పుడే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. నన్ను ఆశీర్వదించండి.. ‘అవుట్ సైడ్’ నుంచి వచ్చే ఆలోచనలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి.. నిర్మాతగా కొత్త దశలోకి అడుగుపెడుతున్నా.. అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ అనే బ్యానర్ మీద ఇకపై చిత్రాలను నిర్మించబోతోన్నాను అని తాప్సీ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

LAC Standoff సమస్య పరిష్కారానికి భారత్, చైనా నిర్ణయం.. కేంద్రం కీలక ప్రకటన

Thu Jul 15 , 2021
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో చైనా సైన్యంతో ఏడాదికిపైగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది.