ఒప్పేసుకున్న ఎస్‌బీఐ.. జాగ్రత్తగా ఉండాలంటూ కస్టమర్లకు హెచ్చరిక!

మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? అయితే ఒక విషయం తెలుసుకోవాలి. కేవైసీ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ కస్టమర్లను హెచ్చరిస్తోంది. లేకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది.

ప్రధానాంశాలు:అది నిజమే అంటున్న ఎస్‌బీఐకస్టమర్లకు అలర్ట్జాగ్రత్తగా ఉండాలంటూ సూచనదేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లను హెచ్చరిస్తోంది. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కేవైసీ మోసాలు నిజమేనని పేర్కొంటోంది. అందువల్ల బ్యాంక్ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది.

‘కేవైసీ మోసం నిజం. దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. మోసగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను పొందడానికి బ్యాంక్ లేదా కంపెనీ ప్రతినిధిగా నటిస్తూ మోసపూరిత మెసేజ్‌లు పంపుతారు. ఇటువంటి సైబర్ క్రైమ్‌లను ఇక్కడ నివేదించండి’ అంటూ ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

Also Read: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. కీలక నిర్ణయం!

అలాగే ఎస్‌బీఐ ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని సేఫ్టీ టిప్స్ కూడా సూచించింది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
1. ఏ లింక్‌ మీద నైనా క్లిక్ చేయడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
2. కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలంటూ బ్యాంక్ ఎప్పటికీ లింక్స్ పంపదు.
3. మొబైల్ నెంబర్ సహా ఇతర వ్యక్తిగత వివరాలను ఎవ్వరికీ చెప్పొద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

షూ విప్పి మరీ.. సింగర్ చేసిన పనికి అంతా ఫిదా.. విజయ్ ప్రకాశ్‌పై ప్రశంసలు

Wed Jul 14 , 2021
సింగర్ విజయ్ ప్రకాశ్ గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చింతకాయల రవి సినిమాలోని బాగుందే బాగుందే అనే పాటతో తెలుగు శ్రోతలకు దగ్గరయ్యారు విజయ్ ప్రకాశ్. అయితే అత్తారింటికి దారేది చిత్రంలోని ఆరడుగుల బుల్లెట్ సాంగ్‌తో అందరి దృష్టిలో పడ్డారు.