SBI బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే..

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలి. లేకపోతే బ్యాంక్ సేవలకు అంతరాయం కలగొచ్చు. సెప్టెంబర్ చివరి వరకు ఛాన్స్ ఉంటుంది.

ప్రధానాంశాలు:బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ఈ పని చేయండిలేదంటే ఇబ్బందులుదేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐలో మీకు అకౌంట్ ఉందా? లేదంటే ఇతర బ్యాంకుల్లో అయినా ఖాతా కలిగి ఉన్నారా?అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. పాన్ కార్డును, ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. లేదంటే పాన్ కార్డు చెల్లుబాటు కాదు.

ఆదాయపు పన్ను శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే పాన్ ఆధార్ లింక్ అనుసంధానానికి సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ కూడా కస్టమర్లను పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలని కోరుతోంది. అప్పుడే నిరంతరాయంగా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చని పేర్కొంటోంది.

Also Read: పోస్టాఫీస్ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే సులభంగానే రుణం!

ఒకవేళ పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో అవసరమైన లావాదేవీలకు పాన్ కార్డు అందించలేని పరిస్థితి వస్తుంది. దీంతో ఆ లావాదేవీలు నిర్వహించడం కుదరదు. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

బ్యాంకుకు వెళ్లి ఒకరోజులో రూ.50 వేలకు పైగా డబ్బులు డిపాజిట్ చేయాలంటే కచ్చితంగా పాన్ కార్డు కావాలి. రూ.50 వేలకు పైన విలువైన లావాదేవీలను నిర్వహించాలన్నా పాన్ నెంబర్ కచ్చితంగా కావాల్సిందే. అందువల్ల మీరు వెంటనే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

IND vs SL 2021: చాలా రోజుల తర్వాత ఛాన్స్ దొరుకుతోంది: పృథ్వీ షా

Thu Jul 15 , 2021
ఈ ఏడాది ఆరంభం నుంచి యువ ఓపెనర్ పృథ్వీ షా ఆటలో దూకుడు పెరిగింది. మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న ఫస్ట్ బంతి నుంచే అతను టాప్‌గేర్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో హజారే, ఐపీఎల్ 2021లో...