SBIలో అకౌంట్ ఉందా? నెలకు రూ.28తో రూ.4 లక్షల బెనిఫిట్ పొందండిలా!

PMSBY | మీకు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు ఈ స్కీమ్స్‌లో చేరండి. నెలకు రూ.28 పొదుపుతో ఏకంగా రూ.4 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఎలానో తెలుసుకోండి.

ప్రధానాంశాలు:ఎస్‌బీఐలో రెండు స్కీమ్స్చేరితే రూ.4 లక్షల బెనిఫిట్రూ.28 పొదుపు చేస్తే చాలుదేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల సర్వీసులు కూడా ఉన్నాయి. కేంద్రం అందించే పలు స్కీమ్స్‌ను ఎస్‌బీఐ తన కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.

వీటిల్లో రెండు స్కీమ్స్ గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటిల్లో నెలకు రూ.28 చెల్లిస్తే.. ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY అనేవి ఇవి.

Also Read: Bank అదిరిపోయే ఆఫర్.. రూ.10 వేల క్యాష్‌బ్యాక్!

ఇవి రెండూ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఈ రెండు స్కీమ్స్‌లో చేరితే ఏడాదికి రూ.342 చెల్లిస్తే సరిపోతుంది. సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.12 కట్టాలి. దీని ద్వారా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. అలాగే జీవన్ జ్యోతి బీమా యోజనకు ఏడాదికి రూ.330 చెల్లించాలి. దీని ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది.

బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ బెనిఫిట్ లభిస్తుంది. అయితే మీరు ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్‌లో సరిపడా రూ.350 డబ్బులు కలిగి ఉండాలి. అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గానే ప్రీమియం డబ్బులు కట్ అవుతాయి. అప్పుడు మీకు రూ.4 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. లేదంటే లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Ashi Trading టాల్కమ్ పౌడర్ రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు.. రూ.9వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్!

Mon Sep 20 , 2021
అఫ్గనిస్థాన్ నుంచి రెండు కంటెయినర్లలో భారీగా మత్తు పదార్థాలు గుజరాత్ పోర్టుకు చేరుకున్నాయని గుర్తించిన అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి ఏపీ ఆంధ్రప్రదేశ్