టోక్యో ఒలింపిక్స్.. భారత పతాకధారిగా తెలుగు తేజం పీవీ సింధు!

ఒలింపిక్స్‌లో మెడల్ గెలవడమే కాదు.. ఆ క్రీడల్లో పాల్గొనడం కూడా ప్రతి క్రీడాకారుడి కల. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ క్రీడల్లో పాల్గొనే భారత బృందాన్ని అరుదైన అవకాశం తెలుగు తేజం సింధుకు దక్కినట్టు సమాచారం.

ప్రధానాంశాలు:రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు.రజతం గెలించిన స్టార్ షట్లర్ పీవీ సింధూ.టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతాకధారులుగా ఇద్దరు.టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ షట్లర్‌ పీవీ సింధు జాతీయ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం ఉంది. జులై 23 నుంచి జరగనున్న ఒలింపిక్ క్రీడల కోసం ఇద్దరు పతకాధారులను ఎంపిక చేయగా.. వీరిలో పీవీ సింధు ఒకరని తెలుస్తోంది. లింగ సమానత్వం కోసం ఈసారి పురుషులు, మహిళల్లో ఒక్కొక్కరిని పతాకధారులుగా ఎంచుకున్నారు. ‘‘ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరు’’ అని భారత ఒలింపిక్‌ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కానీ, భారత పతాకధారుల్లో సింధు ఉండటం ఖాయం.

2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం నెగ్గిన విషయం తెలిసిందే. ఆ క్రీడల్లో సింధు ఫైనల్స్‌కు చేరి త్రుటిలో స్వర్ణం చేజార్చుకుంది. వాస్తవానికి నిబంధనలు ఏమీ లేనప్పటికీ, ముందు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన క్రీడాకారుడు.. తరువాత ఎడిషన్ కోసం భారతపతాధారిగా ఉండేవారు. రియో ఒలింపిక్స్ భారత్ నుంచి బ్యాండ్మింటన్‌లో పీవీ సింధు, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ పతకాలు సాధించారు. అయితే, టోక్యో ఒలింపిక్స్‌కు సాక్షి మాలిక్ అర్హత సాధించలేదు. దీంతో భారత బృందాన్ని నడిపించే ఇద్దరిలో సింధుకు అవకాశం లభిస్తుంది.

ఇక, పురుషులు ఎవరనేది మాత్రం స్పష్టత లేకపోయినా కొన్ని పేర్లు వినబడుతున్నాయి. అథ్లెట్ నీరజ్ చోప్రా, టీటీ ఆటగాడు ఆచంట శరత్ కమల్, రెజ్లర్ బజరంగ్ పూనియా, బాక్సర్ అమిత్ పంఘాల్‌కు అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే, వీరెవరూ రియో ఒలింపిక్స్‌లో ఏ పతకం సాధించలేదు. గతంలో శరత్ కమల్ కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి.. ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈతలో ఒలింపిక్స్ ‘ఏ’ అర్హత ప్రమాణం.. చరిత్ర సృష్టించిన కేరళ పోలీస్ సాజన్

Sun Jun 27 , 2021
గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఒలింపిక్స్ వచ్చే నెల 23 నుంచి టోక్యో వేదికగా జరగనున్నాయి. ఈ విశ్వక్రీడా మహోత్సవానికి జపాన్ ముస్తాబవుతోంది.