‘అవును.. నా బాడీలో ఆ పార్ట్ అంటే బాగా ఇష్టం..’ నెటిజన్ ప్రశ్నకు శృతి షాకింగ్ సమాధానం

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది నటి శృతి హాసన్. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ అడిన ప్రశ్నకు సమాధానంగా తన బాడీలో ఏ భాగం అంటే చాలా ఇష్టమో వెల్లడించింది.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ ఆ తర్వాత హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి మంచి హిట్లు అందుకుంది. అయితే కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమలో పడి కొంతకాలం పాటు సినిమాలు పక్కన పెట్టేసి తన మాజీ ప్రియుడు, ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో రొమాంటిక్ టూర్స్ వేసింది శృతి. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..

ఇక 2021లో చాలాకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’ తదితర సినిమాలతో మంచి హిట్లు అందుకుంది. దీంతో మరోసారి ఆమె కెరీర్ పీక్స్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఈ భామ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘బాహుబలి’ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ అనే సినిమాలో శృతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదే కాక.. ఆమె చేతిలో మరికొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే సినిమాలతోనే కాదు.. సోషల్‌మీడియా ద్వారా కూడా శృతి అభిమానులకు చేరువలో ఉంటుంది.

తరచూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. దీంతో పాటు లైవ్ ఛాట్‌లు నిర్వహిస్తూ.. ఆమె అభిమానులతో సంభాషిస్తుంది. తాజాగా శృతి నిర్వహించిన లైవ్ ఛాట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఓ అభిమాని.. ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు. దీనికి శృతి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు చేసింది’ అంటూ తన ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని చెప్పకనే చెప్పింది శృతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వారసత్వ హీరోలు.. వీళ్ల వల్ల దేశానికి ఏం ఉపయోగం: ఏకిపారేసిన కోటా శ్రీనివాసరావు

Sat Jul 10 , 2021
మెగా ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీ.. దగ్గుబాటి ఫ్యామిలీ.. మంచు ఫ్యామిలీ.. ఘట్టమనేని ఫ్యామిలీ.. ఇలా టాలీవుడ్‌లో అన్నీ ఫ్యామిలీ ప్యాక్‌లే ఉన్నాయి. ఒకరి తరువాత ఒకరు డజన్ల కొద్దీ ఇండస్ట్రీలోకి వస్తూనే ఉన్నారు.