మహేష్ బాబుపై శ్రీ రెడ్డి నాటీ కామెంట్.. ఏకంగా ఆ మాట అనేస్తూ!! దారుణమైన సెటైర్స్ వేస్తున్న నెటిజన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబుపై శ్రీ రెడ్డి నాటీ కామెంట్ చేసింది. ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు దారుణమైన సెటైర్స్ వేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా శ్రీ రెడ్డి చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. ఎప్పటికప్పుడు బోల్డ్ మాటలతో పిచ్చెక్కించడం, హాట్ ఫొటోలతో హల్చల్ చేయడం శ్రీ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఇక హీరో హీరోయిన్లపై ఆమె చేసే కామెంట్స్ అయితే అబ్బో.. మాటల్లో చెప్పడం కష్టమే. నిత్య వివాదాలతో సహవాసం చేస్తూ, బోల్డుగా ఉంటూ హవా నడిపిస్తున్న ఆమె తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుపై నాటీ కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది. శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్ చూసి నెటిజన్స్ దారుణంగా సెటైర్స్ వేస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి.. గత కొన్ని నెలలుగా సైలెంట్ అయింది. దీంతో ఆమె గురించిన ఎన్నో పుకార్లు షికారు చేశాయి. శ్రీ రెడ్డి ఆరోగ్యం బాగోలేదని అందుకే ఆమె సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటోందని టాక్ నడించింది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరెడ్డి మళ్ళీ రంగంలోకి దూకి ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్ కామెంట్స్ వదులుతోంది.
ఆ ముగ్గురితో చిల్ అయిన సమంత.. వీకెండ్ పార్టీలో ఫుల్ ఎంజాయ్! ఫొటోస్ వైరల్
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుపై రొమాంటిక్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. తాజాగా సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొన్న మహేష్ ఫొటోను షేర్ చేసిన శ్రీరెడ్డి ‘సిమ్లా యాపిల్‌లా ఉన్నాడు బాబు' అంటూ నాటీగా క్యాప్షన్ పెట్టేయడంతో ఈ పిక్ వైరల్ అయింది. దీంతో ఈ పోస్ట్ చూసి నెటిజన్లు రెచ్చిపోతున్నారు. 'ఆయనొక్కన్ని వదిలేయ్.. మిగితా ఇండస్ట్రీ అంతా నీ ఇష్టం' అంటూ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇంకొందరైతే దారుణమైన పదజాలంతో సెటైర్లు వేస్తూ రచ్చ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మరో సినిమాకు మద్దతు ఇచ్చిన ప్రభాస్.. ‘ఆకాశవాణి’ ట్రైలర్ లాంచ్ చేసి రెబల్ స్టార్

Mon Sep 20 , 2021
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్లు అవుతున్నాయి. మంచి కాన్సెప్ట్.. స్క్రిన్‌ప్లేతో వస్తున్న ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమే ‘ఆకాశవాణి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయింది.