IND vs SL సిరీస్‌కి లైన్ క్లియర్.. శ్రీలంక క్రికెటర్లు పాస్

కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య సిరీస్‌కి మార్గం సుగుమమైంది. లంక టీమ్‌లో కరోనా కేసులు నమోదవడంతో.. ఐదు రోజులు వాయిదాపడిన సిరీస్ 18 నుంచి స్టార్ట్ కాబోతోంది.

ప్రధానాంశాలు:శ్రీలంక క్రికెటర్లకి తాజా పరీక్షల్లో కరోనా నెగటివ్భారత్‌తో ఈ నెల 18 నుంచి సిరీస్ మొదలుఐదు రోజులు ఆలస్యంగా ప్రారంభంకాబోతున్న మ్యాచ్‌లుఈరోజు బయో- సెక్యూర్ బబుల్‌లోకి లంక టీమ్ భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా సిరీస్‌కి లైన్ క్లియరైంది. మారిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నుంచి ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది. వాస్తవానికి ఈ నెల 13 నుంచే ఈ సిరీస్ ప్రారంభంకావాల్సి ఉంది. కానీ.. శ్రీలంక జట్టులో మూడు కరోనా కేసులు నమోదవడంతో ఐదు రోజులు వాయిదాపడింది.

ఇంగ్లాండ్ టూర్‌ని ఇటీవల ముగించుకున్న శ్రీలంక జట్టు కొలంబోకి చేరుకోగా.. ఇంగ్లాండ్ టీమ్‌లో ఏకంగా ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో.. శ్రీలంక క్రికెటర్లకి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఒక క్రికెటర్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్ట్ జీటీ నిరోషాన్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. మరోసారి ఆటగాళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్టు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ వచ్చింది.

సీనియర్ క్రికెటర్లు కుశాల్ పెరీరా, ఛమీరా, ధనంజయ డిసిల్వాతో పాటు ఆటగాళ్లందరికీ నెగటివ్ రావడంతో.. ఈరోజు శ్రీలంక టీమ్ బయో- సెక్యూర్ బబుల్‌లోకి ప్రవేశించనుంది. మరోవైపు ఇప్పటికే కొలంబోకి చేరుకున్న శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు.. క్వారంటైన్‌ని పూర్తి చేసుకుని బబుల్‌లో ఉన్న విషయం తెలిసిందే. సిరీస్ కోసం శ్రీలంక టీమ్ ఆర్. ప్రేమదాస స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుండగా.. టీమిండియా మాత్రం సింగ్‌లీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Virat Kohli ఐపీఎల్ టైటిలే గెలవలేదు.. ఇక ఐసీసీ ట్రోఫీనా..?: సురేశ్ రైనా

Mon Jul 12 , 2021
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ జట్టు ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ని కూడా గెలవలేదు. ఐపీఎల్‌లోనూ ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌కి గత కొన్నేళ్లుగా టైటిల్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది.