రుతుపవనాల మందగమనం.. మొహం చాటేసిన వరుణుడు, ఎల్లుండి నుంచి

నైరుతి రుతుపవనాల మందగమనంతో ఆంధ్రప్రదేశ్‌లో వరుణుడు మొహం చాటేశాడు. తొలినాళ్లలో భారీవర్షాలు కురవడంతో అన్నదాతల ఆశలు చిగురించగా.. తాజా పరిస్థితితో నిరాశలో కూరుకుపోయారు.

ప్రధానాంశాలు:నైరుతి రుతుపవనాల మందగమనంఆంధ్రప్రదేశ్‌లో మొహం చాటేసిన వరుణుడువర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలుఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు మందగించడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పశ్చిమ, నైరుతి గాలులు బలంగా వీస్తున్న కారణంగా రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు మినహా భారీ వర్షాలు కురవడం లేదు. రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతోంది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతన్నలు తాజా పరిస్థితితో అయోమయంలో పడిపోయారు. వరుణుడు కరుణించకపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయి.

ఈ నెల 1 నుంచి 20 వరకు రాష్ట్రంలో 70.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 59.6 మిల్లీమీటర్లు నమోదైందని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 67.7 శాతం వర్షపాతం లోటు ఉండగా, ప్రకాశం, గుంటూరు, ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 30-48శాతం లోటు ఏర్పడింది. కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, కడప, అనంతపురంలో ఆశాజనకంగా వర్షాలు పడ్డాయి.

రుతుపవనాలు రాష్ట్రంపై అంతగా ప్రభావం చూపడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడ్డాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు కోస్తా, రాయలసీమల్లో ఈ నెల 23 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

WTC Finalలో సింగిల్ కోసం షాట్ ఆడి.. అజింక్య రహానె మూల్యం

Mon Jun 21 , 2021
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అజింక్య రహానె తొందరపడ్డాడు. అప్పటి వరకూ సహనంతో ఆడిన రహానె హాఫ్ సెంచరీ ముంగిట సింగిల్ కోసం ఫుల్ షాట్ ఆడాడు. కానీ..