గూగుల్ పే కస్టమర్లకు శుభవార్త.. ఇక ఇంట్లో నుంచే..

మీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకు కొత్త సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎఫ్‌డీ సేవలు పొందొచ్చు. మీరు ఇంట్లో నుంచే బ్యాంక్‌లో అకౌంట్ లేకపోయినా కూడా ఎఫ్‌డీ తెరిచే ఛాన్స్ ఉండనుంది.

ప్రధానాంశాలు:త్వరలో గూగుల్ పే కొత్త సేవలుఇంట్లో నుంచే ఎఫ్‌డీ తెరవొచ్చుబ్యాంక్ అకౌంట్ ఉండక్కర్లేదుమీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. మీకు త్వరలోనే కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ పే కస్టమర్లు ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ FD సేవలు పొందొచ్చు. దీని కోసం గూగుల్ పే ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.

వెలువడుతున్న నివేదిక ప్రకారం.. గూగుల్ ఇప్పటికే ఫిన్‌టెక్ సంస్థ సేతుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ పే వాడే వారు తొలిగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజల దగ్గరి నుంచి ఏడాది కాల పరిమితి వరకు ఎఫ్‌డీలో డబ్బులు పెట్టే అవకాశం ఉండొచ్చు.

Also Read: నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్.. వారి పెన్షన్ పెంపు!

ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 6.35 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ సేవలు పొందాలని భావించే వారు ముందుగా ఆధార్ ఆధారిత కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను ముగించొచ్చు. ఇక్కడ ఒక చెప్పుకోదగ్గ అంశం ఒకటుంది.

మీకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా మీరు ఆ బ్యాంక్‌లో ఎఫ్‌డీ ఓపెన్ చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఎఫ్‌డీలోకి వెళ్తాయి. అలాగే అదే అకౌంట్‌లోకి మళ్లీ తిరిగి వచ్చేస్తాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి వాటిల్లో కూడా కస్టమర్లకు గూగుల్ పే ద్వారా ఎఫ్‌డీ తెరవొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

‘అవి చూడగానే ఏడ్చేశాను’.. రకుల్ నుంచి ఇది అస్సలు ఊహించుండరు!

Thu Aug 26 , 2021
హీరోయిన్‌లు అంటే చాలా సున్నితంగా ఉంటారు అని అంతా అనుకుంటారు. కానీ, రకుల్ ప్రీత్‌ సింగ్‌ని చూస్తే అలా అనిపించదు. చాలా సందర్భాల్లో ఆమె చాలా ధైరంగా మాట్లాడి శభాష్ అనిపించుకుంది. అయితే రీసెంట్ ఆమె ఒకటి చూసి ఏడ్చేశాను.