మరో బెస్ట్‌టీవీని మార్కెట్లో లాంచ్ చేసిన టీవీ.. 65 అంగుళాల స్క్రీన్.. ధర ఎంతంటే?

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ బ్రాండ్ సోనీ తన కొత్త స్మార్ట్ టీవీని మనదేశంలో లాంచ్ చేసింది. అదే సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80జే ఓఎల్ఈడీ టీవీ. ఇందులో 65 అంగుళాల డిస్‌ప్లేను అందించడం విశేషం.

ప్రధానాంశాలు:సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ కొత్త టీవీ వచ్చేసిందిధర రూ.2,99,990గా నిర్ణయించిన కంపెనీసోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80జే ఓఎల్ఈడీ టీవీ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 65 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. ఇందులో డెడికేటెడ్ గేమ్ మోడ్ కూడా అందించారు. హెచ్‌డీఎంఐ 2.0, 4కే 120ఎఫ్‌పీఎస్ వీడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎక్స్ఆర్ ఓఎల్ఈడీ కాంట్రాస్ట్, ఎక్స్ఆర్ ట్రిలుమినస్ ప్రో, ఎక్స్ఆర్ మోషన్ క్లారిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో సోనీ అందించింది.

సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80జే ఓఎల్ఈడీ టీవీ ధర
ఈ సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80జే ఓఎల్ఈడీ టీవీ XR-65A80J మోడల్ నంబర్‌తో వచ్చింది. ఈ 65 అంగుళాల 4కే టీవీ ధరను రూ.2,99,990గా నిర్ణయించారు. అన్ని సోనీ సెంటర్ అవుట్‌లెట్లు, మేజర్ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టళ్లలో దీని సేల్ జరగనుంది. ఇందులో 77 అంగుళాలు, 55 అంగుళాల వేరియంట్లు కూడా త్వరలో లాంచ్ చేయనున్నట్లు సోనీ తెలిపింది.
ఈ ఫోన్ సబ్బుతో కడిగేయచ్చు.. మోటొరోలా సూపర్ స్ట్రాంగ్ ఫోన్ వచ్చేసింది!
సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80జే ఓఎల్ఈడీ స్పెసిపికేషన్లు
ఇందులో సోనీ సన్నటి అంచులను అందించింది. ఫోన్ కింది వైపు కాస్త ఎక్కువ మందం ఉండనుంది. కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. అద్భుతమైన వీడియో అనుభవాన్ని ఈ టీవీ అందించనుంది. డెడికేటెడ్ గేమింగ్ మోడ్ కూడా ఇందులో అందించారు. ఎక్స్ఆర్ ఓఎల్ఈడీ కాంట్రాస్ట్ అనే ఫీచర్‌ను ఇందులో అందించారు. దీంతోపాటు ఎక్స్ఆర్ ట్రిలుమినోస్ ప్రో, ఎక్స్ఆర్ మోషన్ క్లారిటీ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. వీటి ద్వారా మీరు టీవీ చూసే అనుభవం మరో స్థాయికి వెళ్లనుంది.

దీంతోపాటు సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80జే ఓఎల్ఈడీ టీవీలో ఎక్స్ఆర్ సౌండ్ పొజిషనింగ్ కూడా ఉండనుంది. ఎక్స్ఆర్ సరౌండ్, 3డీ సరౌండ్ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, యాపిల్ ఎయిర్ ప్లే 2, హోం కిట్ వంటి అసిస్టెంట్లకు కూడా ఇందులో సపోర్ట్ అందించారు. హెచ్‌డీఎంఐ 2.0 పోర్టు కూడా ఇందులో ఉంది. 4కే 120ఎఫ్‌పీఎస్ వీడియోను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. యాంబియంట్ ఆప్టిమైజేషన్, లైట్ సెన్సార్, అకౌస్టిక్ ఆటో క్యాలిబరేషన్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండనున్నాయి.
రెండు ఫోన్లు, ఒక టీవీ లాంచ్ చేయనున్న రియల్‌మీ.. అన్నీ రూ.15 వేలలోపే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ ట్యాబ్లెట్స్ వాడితే ఒత్తిడి తగ్గుతుందట..

Fri Jun 18 , 2021
యాంగ్జైటీ అన్నది ఒత్తిడికి మన బాడీ ఇచ్చే నేచురల్ రెస్పాన్స్. తరువాత ఏం జరుగుతుందో అనే భయం ఇందులో ఉంటుంది. స్కూల్ మొదటి రోజు, జాబ్ ఇంటర్వ్యూ, స్పీచ్ ఇవ్వడం వంటివి ఎక్కువమంది నెర్వస్‌గా ఫీల్ అయ్యే విషయాలు. ఇలా కాక రోజు వారీ జీవితాల్లో జరిగే విషయాలకి కూడా ఆందోళన చెందుతూ ఉంటే ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. లేదంటే, యాంగ్జైటీ సీరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూ లా తయారవుతుంది.