ఇలా సంతోషంగా ఉండనివ్వండి.. పొలిటికల్‌ ఎంట్రీపై సోనూసూద్‌ స్పందన

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కష్టపడుతున్నవారి కోసం నటుడు సోనుసూద్ అవిశ్రాంతంగా మరియు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సెకండ్ వేవ్ సమయంలో కూడా ఆయన లక్షలాది మందికి సహాయం చేశారు.

కష్టాల్లో ఉన్న మనిషికి సహాయం చేస్తే.. ఆ వ్యక్తిని దేవుడిలా పూజిస్తారు. ఒకరికి సహాయం చేస్తేనే దేవుడంటే… వేలాది మందికి సహాయం చేస్తే ఆ వ్యక్తిని ఏమనాలి. ప్రస్తుతానికైతే సోనుసూద్ అని పిలవాలి. కరోనా కారణంగా ఏర్పడిన ఉపద్రవ పరిస్థితుల్లో సోనూ ఎందరికో ఆపద్భాందవుడిలా నిలిచాడు. వేలాది మంది వలసకార్మికులు, నిరుపేదలను స్వస్థలాలు తరలించాడు. ఉపాధి కోల్పోయిన ఎందరికో అతను అండగా నిలిచాడు. లాక్‌డౌన్ ముగిసి కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయని అంతా ఆనందించే లోపే రెండో దశలో మహమ్మారి దేశాన్ని మరింత దట్టంగా కమ్మేసింది.

ఇక సెకండ్ వేవ్ సమయంలోనూ సోనూసూద్.. తన ఆపన్నహస్తాన్ని వెనక్కి తీసుకోలేదు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో.. ప్రజలు కష్టాలు ఎదురుకోవద్దనే ఉద్దేశంతో ఆయన స్వయంగా ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటు చేశారు. అంతేకాక.. సోషల్‌మీడియా ద్వారా అవసరంలో ఉన్నవారి వివరాలు తెలుసుకుంటూ.. వారికి తగిన సహాయం అందిస్తున్నారు. చాలామంది అవసరంలో ఉన్నవాళ్లు సోనూసూద్ ఇంటి వద్దకు వెళ్లి.. ఆయనకు తమ అవసరాలు తెలియజేశారు. వారికి కూడా ఆయన తగిన సహాయం అందజేశారు సోనూ.

అయితే తాజాగా ఆయనకు ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. 2022 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ముంబై మేయర్‌గా పోటీ చేస్తున్నారంటూ ఓ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. అయితే దీనిపై సోనూసూద్ తాజాగా స్పందించారు. ‘ఇది నిజం కాదు.. నేను సామాన్యుడిగానే సంతోషంగా ఉన్నాను ’ అంటూ ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా సోనూసూద్‌ను దేశానికి ప్రధాని చేయాలి అంటూ చాలా మంది అన్నారు. దీనిపై కూడా స్పందించిన సోనూ తనకు రాజకీయాలు అంటే ఇష్టం లేదని.. ఇలాగే ప్రజా సేవ చేయడమే తనకు ఇష్టం అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అఫ్గన్ పరిస్థితి చూశాక మిమ్మల్ని నమ్మేదెవరు.. అమెరికాపై చైనా ఘాటు వ్యాఖ్యలు

Tue Aug 24 , 2021
అఫ్గనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు అమెరికాయే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు దశబ్దాలు అఫ్గన్ గడ్డపై పోరాటం చేసి, అక్కడ సైనికులకు శిక్షణ ఇచ్చినా ఎటువంటి ప్రతిఘటన లేకుండా తాలిబన్లకు లొంగిపోయారు.