సోనూసూద్‌కి మరో గౌరవం.. ఆయన సేవలు చూసి అరుదైన స్థానం ఇచ్చిన దిల్లీ సీఎం

కరోనా వ్యాప్తి ఆరంభం జరిగిన రోజు నుంచి ప్రజలకు ఎంతగానో సహాయం చేస్తూ.. రియల్ హీరోగా నిలిచారు సోనూసూద్. ఆయన చేస్తున్న ఈ సమాజసేవకులకుగాను ఇప్పటికే ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి. తాజాగా మరో అవార్డు కూడా ఆయనకు దక్కింది.

కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సహాయం చేస్తూ.. ఆపద్భాందవుడిగా నిలిచారు సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రలు చేసే ఆయన.. ఈ క్లిష్టపరిస్థితుల్లో చేస్తున్న సేవలకుగాను రియల్ హీరో అనిపించుకుంటున్నారు. అడిగిన ప్రతి ఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా సాయం అందిస్తున్నారు. ‘కష్టం వచ్చింది.. సాయం చేయండి’ అని వేడుకోవడమే ఆలస్యం.. నేనున్నానంటూ ముందుకొస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది విధించిన లాక్ డౌన్ దగ్గర నుంచి లక్షల మందికి సాయం సోనూసూద్ సాయం చేశారు. తాజాగా సెకండ్ వేవ్‌లోనూ ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్వయంగా ప్రజల అవసరాలను తెలుసుకొని వారిని ఆదుకుంటున్నారు.

అయితే సెకండ్ వేవ్‌లోనూ సోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు. సోషల్‌మీడియా ద్వారా అవసరంలో ఉన్న వారి వివరాలు తెలుసుకొని ఆయన వారికి సహాయం అందించారు. అంతేకాక.. రోజుకు వందలాది మంది సోనూ ఇంటి వద్దకు వెళ్లి.. ఆయనకు తమ గోడును విన్నవించుకున్నారు. అలా వారి సహాయం అడిగి తెలుసుకున్న సోనూ.. వారి కష్టాలను కూడా కడతేర్చారు. ఇక సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో.. ఆయన విదేశాల నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసి.. మన దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటు చేశారు. మరి ఇన్ని చేసిన ఆయనకు అవార్డులు లభించకుండా ఉంటాయాయ..? ఇప్పటికే ఎన్నో అవార్డులు ఆయనకు వచ్చాయి.

తాజాగా సోనూసూద్‌కు ఢిల్లీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. విద్యార్థుల కోసం దిల్లీ ప్రభుత్వం తీసుకొస్తున్న ‘దేశ్ కా మెంటార్’ కార్యక్రమానికి సోనును బ్రాండ్ అంబాసడర్‌గా నియమించారు. ఈ విషయాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. సోనూసూద్ సేవలను మనందరం చూస్తూనే ఉన్నామని. ఇప్పుడు దిల్లీ సర్కారు బడులల్లో చేపట్టిన ‘దేశ్ కా మెంటార్’ అనే కార్యక్రమానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నారు’ అంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మోటో జీ50 5జీ వచ్చేసింది.. బడ్జెట్‌లోనే 5జీ ఫోన్!

Fri Aug 27 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే మోటో జీ50 5జీ. ఈ ఫోన్ ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో లాంచ్ అయింది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.