ఇండస్ట్రీలోని వ్యక్తులంతా అలాంటోళ్లే.. అందుకే అలా డిసైడ్ అయ్యా! బాంబ్ పేల్చిన హాట్ హీరోయిన్

సెలబ్రిటీల క్యారెక్టర్స్, రిలేషన్స్, ఇండస్ట్రీలోని వ్యవహారాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. అందుకే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్ళాడలేదని ఆమె చెప్పింది.

సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎన్నోరకాల వ్యక్తులుంటారని చాలా సందర్బాల్లో విన్నాం. ఇతర రంగాలతో పోలిస్తే సినీ పరిశ్రమ లోని వ్యక్తులు ఎక్కువగా ఫోకస్ అవుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కెమెరా ముందు కనిపించే తారల పర్సనల్ విషయాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్స్ లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్ లాంటి సంగతులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీల క్యారెక్టర్స్, రిలేషన్స్, ఇండస్ట్రీలోని వ్యవహారాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.

2018 సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది సోనమ్ కపూర్. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల హడావిడి కనిపించింది. ఇక పెళ్లి తర్వాత భర్తతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తున్న సోనమ్.. తన వివాహం, ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌లో పని చేసే వాళ్ల ప్రపంచం ప్రత్యేకంగా ఉంటుందని, వాళ్ల ఆలోచనలు ఎప్పుడూ ఒకలా ఉండవని పేర్కొన్న ఆమె.. అసలు వాళ్ళు ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా అదే అని ఆమె చెప్పింది. అందుకే ఆనంద్‌ని పెళ్లాడాలని డిసైడ్ అయి ఇప్పుడు హాపీగా ఉంటున్నానని చెప్పింది సోనమ్.
డేట్‌కి వెళ్లిన రామ్ చరణ్- ఉపాసన.. హోటల్‌లో మెగా దంపతులు అలా! నెటిజన్స్ క్రేజీ రియాక్షన్స్
ఆనంద్ ఎప్పుడూ తన లాగే ఆలోచిస్తాడని, ఫెమినిజం భావజాలం ఉన్న వ్యక్తి అని చెప్పిన సోనమ్ కపూర్.. అతడిని వివాహం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చాలా తామిద్దరం సంతోషంగా ఉన్నామని ఆమె చెప్పింది. సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్.. పలు హిట్ సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కార్డియాక్ అరెస్ట్‌తో మాజీ సీఎం కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నా వెంటాడిన అనారోగ్యం

Thu Jul 8 , 2021
ఆరుసార్లు ఎంపీగా, ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత.. అనారోగ్యంతో కన్నుమూశారు. వయసుపై బడటంతో అనారోగ్యం వెంటాడింది.