టుడే ఇన్‌స్టా హిట్స్: తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి.. కర్రసాము చేస్తున్న అదా.. వాళ్లతో కలిసి మంజూషా డ్యాన్స్

సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు ప్రతీ రోజు ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. అలా సెలబ్రటీలు పోస్ట్ చేసిన ఆసక్తికర విషయాలను మీ ముందు ఉంచాలనేదే మా ఈ ప్రయత్నం. ఈ రోజు (సెప్టెంబర్ 20న) సెలబ్రిటీలు పోస్ట్ చేసిన అప్‌డేట్స్ ఏంటో ఓ లుక్ వేయండి.

తీవ్రంగా గాయపడిన నటి లక్ష్మి…

తన అందంతో పలు సినిమాల్లో ప్రేక్షకులను ఫిదా చేసిన నటి రాయ్ లక్ష్మి.. షూటింగ్‌లో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడి రక్తం కారుతున్న ఓ ఫోటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అయితే అవి నిజం గాయాలు కావు.. ఆమె నటిస్తున్న ‘సిండ్రెల్లా’ అనే సినిమా షూటింగ్‌లో భాగంగా చేసిన మేకప్. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కానుంది.
View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi)
రెడ్ కార్పెట్‌పై ‘జాతిరత్నాలు’ బ్యూటీ హంగామా

అందుకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి.. ‘జాతిరత్నాలు’ అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా. పూర్తిస్థాయి కామెడీ చిత్రంగా తెరరకెక్కిన ఈ సినిమాలో ఫరయా తనదైన స్టైల్‌లో కామెడీ పంచి ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ‘సైమా’ అవార్డు ఫంక్షన్‌లో ఈ భామ మెరిసింది. రెడ్ కలర్ డ్రెస్ ధరించి.. రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది ఈ సుందరి.
View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)
కర్రసాము చేస్తున్న ‘అదా శర్మ’

‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న సుందరి అదా శర్మ. ఆ తర్వాత కూడా తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసి.. ఆమె ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కర్రసాము చేసుకుంటూ.. ఓ వీడియోని పోస్ట్ చేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది అదా.
View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah)
డల్ లుక్‌లో నటి పూనమ్

పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్న నటి పూనమ్ కౌర్.. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక సోషల్‌మీడియాలో మాత్రం ఈ భామ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈమె చేసిన కొన్ని పోస్టులు ఎన్నో వివాదాలకు తెరతీశాయి. తాజాగా డల్‌గా ముఖం పెట్టి ఓ పిక్‌ని షేర్ చేసింది పూనర్. దీనికి ‘ది ఎక్సామ్ ఫేస్’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur)
వారందరితో కలిసి మంజుషా డ్యాన్స్

దక్షిణ భారత సినీ పరిశ్రమలు అన్ని కలిసి జరుపుకొనే సైమా అవార్డుల ఫంక్షన్ వైభవంగా జరుగుతోంది. ఈ షోలో తెలుగు విభాగంలో రెడ్ కార్పెట్ వద్ద అదిరే అభి, మంజుషాలు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. రెడ్ కార్పెట్ మీదకు వచ్చిన సెలబ్రిటీలను ఆసక్తికర ప్రశ్నలు అడుగుతు వాళ్లని ఫంక్షన్‌కి ఆహ్వానిస్తున్నారు. తాజాగా రెడ్ కార్పెట్‌పై వచ్చిన సెలబ్రిటీలతో డ్యాన్సులు చేస్తూ.. ఓ చిన్న వీడియోని షేర్ చేసింది మంసుషా.
View this post on Instagram A post shared by Manjusha Rampalli (@anchor_manjusha)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BLITZ of DANIEL SHEKAR : లుంగీలో అదరగొట్టేశావ్ బ్రో.. రానాపై పృథ్వీరాజ్

Mon Sep 20 , 2021
అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనే ప్రధానం. అయ్యప్పన్ నాయర్‌గా బిజూ మీనన్, కోషి కురియన్ పాత్రలో పృథ్వీరాజ్ ఒకరిని మించి మరొకరు నటించేశారు.