టుడే ఇన్‌స్టా హిట్స్: కాజల్‌కి కొత్త బిరుదు.. అమ్మాయిగారి అందాల వల.. మాస్కోలో వింక్ బ్యూటీ

సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు ప్రతీ రోజు ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. అలా సెలబ్రటీలు పోస్ట్ చేసిన ఆసక్తికర విషయాలను మీ ముందు ఉంచాలనేదే మా ఈ ప్రయత్నం. ఈ రోజు (జూలై 16న) సెలబ్రిటీలు పోస్ట్ చేసిన అప్‌డేట్స్ ఏంటో ఓ లుక్ వేయండి

కాజల్ అగర్వాల్‌కి కొత్త బిరుదు.. ఎవరిచ్చారంటే..

‘లక్ష్మీ కళ్యాణం’, ‘చందమామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ కాజల్ అగర్వాల్. చూపు తిప్పుకోలేని తన అందం అభినయంతో కొంత సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. ఇక సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కాజల్ తరచూ తన పిక్స్‌ని ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ పుస్తకం చదువుతూ దాన్ని ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. ‘ఎప్పటికైనా పుస్తకాల పురుగునే’ అంటూ తనకి తాను బిరుదు ఇచ్చుకుంది కాజల్.
View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
ఐదు వేలు ఖర్చు చేస్తే.. రూ.ఐదు వచ్చాయి: నిఖిల్

యాక్షన్ సినిమాలైనా, కామెడీ సినిమాలైనా, థిల్లర్ సినిమాలైనా అలవోకగా నటిస్తూ ప్రేక్షకుల మనస్సు దోచుకుంటున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్త్. కెరీర్ ఆరంభంలో కొన్ని ఫ్లాపులు చవి చూసిన ఆ తర్వాత తన రూటు మంచి మంచి సక్సెస్‌లు అందుకుంటున్నాడు అతను. ఈ మధ్యే కరోనా లాక్‌డౌన్ సమయంలో నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కడు. పెళ్లి తర్వాత ఖర్చులు బాగా పెరిగిపోయాయేమో పాపం.. ఐదు రూపాయిలు క్యాష్‌బ్యాక్ వచ్చినా సంబరపడిపోతున్నాడు. ‘ఐదు వేలు ఖర్చు చేసినప్పుడు ఐదు రూపాయిలు క్యాష్‌బ్యాక్ వస్తే ఎక్స్‌ప్రెషన్ ఇలాగే ఉంటుంది’ అంటూ అతను ఓ పిక్‌ని షేర్ చేశాడు.
View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)
‘అమ్మాయిగారు’ అమృత అందాల వల

తమిళంలో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించన నటి అమృత అయ్యారు. ముఖ్యంగా విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’ అనే సినిమాతో ఈ భామ మంచి సక్సెస్ అందుకుంది. ఇక తెలుగులో యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ.. అమృత నటనకు, ఆమె అందానికి మాత్రం అంతా ఫిదా అయ్యారు. తాజాగా పసుపు రంగు దుస్తుల్లో తన అందాల వల వేస్తూ.. కొన్ని పిక్స్‌ని షేర్ చేసింది ఈ ‘అమ్మాయిగారు’.
View this post on Instagram A post shared by Amritha – Thendral (@amritha_aiyer)
‘మీరు ఏం చూస్తున్నారు..’ కిల్లింగ్ లుక్స్‌తో నివేధా ప్రశ్న

‘జెంటిల్‌మెన్’, ‘నిన్ను కోరి’ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది నటి నివేధా థామస్. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండే భామ.. కేవలం తన అభినయం, నటనతోనే అందరిని ఆకట్టుకుంటుంది. తొలుత చిన్న హీరోల సరసన చేసిన ఆమె.. ఈ మధ్య స్టార్స్‌తో నటిస్తోంది. రజనీకాంత్‌తో ‘దర్బార్’, పవన్‌కళ్యాణ్‌తో ‘వకీల్‌సాబ్’ సినిమాల్లో నటించి మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ. ఒక సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నివేధా తాజాగా కిల్లింగ్ లుక్స్‌తో ‘మీరు ఏం చూస్తున్నారు’ అని అభిమానులను ప్రశ్నిస్తూ ఓ పిక్ షేర్ చేసింది.
View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas)
రష్యా రాజధానిలో వింక్ బ్యూటీ షికార్లు..

‘ఓరు అడార్ లవ్’ సినిమాలో ఓ సన్నివేశం ఓ నటి జీవితాన్ని మార్చేసింది. కేవలం ఆ సీన్‌లో కన్నుకొట్టి నేషనల్ క్రష్‌గా ఓవర్‌నైట్‌లో ఎదిగిపోయింది ప్రియా వారియర్. ఈ దెబ్బతో ముందు అనుకున్న హీరోయిన్‌ని తీసేసి.. ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్‌గా చేశారు కూడా. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆమె ఆ తర్వాత చేసిన సినిమాల పరిస్థితి కూడా అంతే. దీంతో సరైన హిట్ల కోసం ప్రియా కుస్తీ పడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో అందాల ఆరబోత ప్రారంభించింది. అయినా కూడా ఈ భామకి తగినన్ని ఛాన్స్‌లు రావడం లేదు. ప్రస్తుతం ఈ వింక్ బ్యూటీ హాలీడేని ఎంజాయ్ చేస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో ఈ భామ సందడి చేస్తోంది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
View this post on Instagram A post shared by Priya Prakash Varrier�� (@priya.p.varrier)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

‘బాయ్స్‌’ కోసం కదలి వచ్చిన సన్నీ లియోనీ.. సెన్సేషనల్ సినిమా టీజర్ లాంచ్

Fri Jul 16 , 2021
టాలీవుడ్ ‘బాయ్స్’ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోనీ కదలి వచ్చింది. ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన ఆమె.. దయానంద్ తెరకెక్కిస్తున్న ‘బాయ్’ అనే సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమాలో గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.