ఆక్సిజన్ కొరతతో వేర్వేరు ఆస్పత్రుల్లో 12 మంది మృతి

ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సమస్యపై గతేడాది నవంబరులో పార్లమెంట్ స్థాయీ సంఘం కేంద్రాన్ని హెచ్చరించింది.

ప్రధానాంశాలు:ప్రాణాలు నిలపాలని రోగుల ఆక్రందనలు.ఆస్పత్రిల్లో బాధితులను చేర్చుకోని వైద్యులు.దేశంలో మరింత దయనీయంగా పరిస్థితులు.కరోనా వైరస్ విలయానికి దేశం చిగురుటాకులా వణుకుతోంది. ఆక్సిజన్ అందక డజన్ల కొద్దీ కోవిడ్ రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి చోట్ల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదువుతున్నాయి. ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, థానేలోని వేదాంత్ హాస్పిటల్‌లో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు.

నాసిక్ ఆస్పత్రిలో గతవారం ఆక్సిజన్ ట్యాంకర్‌ లీకయి సరఫరా నిలిచిపోవడంతో 24 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఢిల్లీలోనూ రెండు ఆస్పత్రుల్లో 50 మంది ప్రాణవాయువు అందక చనిపోయారు. హరియాణాలోని హిసార్‌లో సోమవారం ఉదయం ఐదుగురు కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక మృతిచెందారు. ఆ రాష్ట్రంలో ఇది మూడో ఘటన. ఆదివారం గురుగ్రామ్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో నలుగురు, రేవారీలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో నలుగురికి ఆక్సిజన్ అందక ఊపిరాగిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా మహారాజ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఇద్దరు రోగులు చనిపోయారు. ఆస్పత్రిలో కేవలం ఇద్దరు మృతి చెందారని… ఈ మృతికి ఆక్సిజన్ కొరత కాదని అధికారులు అంటున్నారు. కరోనాతోనే మృతిచెందారని చెబుతున్నాయి. అయితే, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది తలెత్తడంతో తమవారు చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనా వ్యాప్తికి ఈసీయే కారణం.. అధికారులపై హత్య కేసు: మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు

Mon Apr 26 , 2021
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ పార్టీలు కనీసం కోవిడ్ నిబంధనలు పాటించలేదు.