ఈ మ్యూచువల్ ఫండ్స్‌‌తో కళ్లుచెదిరే లాభం.. రూ.3 వేలతో రూ.20 లక్షలు!

మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టాలని యోచిస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మంచి ఫండ్‌లో డబ్బులు పెడితే.. దీర్ఘకాలంలో అదిరిపోయే రాబడి సొంతం చేసుకోవచ్చు.

ప్రధానాంశాలు:మ్యూచువల్ ఫండ్స్‌తో అదిరే లాభంరూ.3000 ఆదా చేస్తే చాలుఅదిరిపోయే రాబడిమ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మీరు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడుతున్నారనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. మంచి ఫండ్ స్కీ్మ్‌లో డబ్బులు పెడితే అదిరే రాబడి సొంతం చేసుకోవచ్చు.

స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. అందువల్ల ఒకేసారి కాకుండా సిప్ రూపంలో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు. మీరు రోజుకు రూ.100 సిప్‌తో అంటే నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తే.. మీరు 15 ఏళ్లలో రూ.20 లక్షలు పొందొచ్చు.

Also Read: గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ లోన్ గురించి తెలుసా? తీసుకుంటే కలిగే బెనిఫిట్స్ ఇవే!

ప్రస్తుతం మార్కెట్‌లో చాలా ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి 15 శాతం పైగా రాబడిని అందిస్తున్నాయి. మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ మూడేళ్ల కాలంలో 13.8 శాతం, ఐదేళ్లలో 15.9 శాతం, పదేళ్లలో 15.4 శాతం రాబడిని అందించింది. కెనరా రొబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ కూడా 3 ఏళ్లు, 5 ఏళ్ల కాలంలో 16.8 శాతం, 16.6 శాతం చొప్పున రాబడిని ఇచ్చింది. పదేళ్లలో 13.6 శాతం రాబడిని ఆఫర్ చేసింది.

ఆదిత్య బిర్లా ఎల్ఎల్ ఫ్లెక్సీ క్యాప్ 3 ఏళ్లు, 5 ఏళ్లు, పదేళ్లలో వరుసగా 12.6 శాతం, 15.5 శాతం, 14.9 శాతం చొప్పున రాబడి అందించింది. కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ కూడా వరుసగా 15.5 శాతం, 17.5 శాతం, 18.5 శాతం చొప్పున రాబడిని ఇచ్చింది. అంటే మీరు నెలకు రూ.3 వేలు పెడితే 15 ఏళ్లలో రూ.20 లక్షలు పొందొచ్చు. ఇక్కడ 15 శాతం రాబడిని పరిగణలోకి తీసుకున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

WTC Final‌లో ఈరోజు ఆట డౌట్.. మొదటిరోజు తరహాలోనే..?

Mon Jun 21 , 2021
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ వరుణుడు దెబ్బకి సాఫీగా జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఒకరోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోగా.. సోమవారం రాత్రి వరకూ..?