రూ.165తో కోటీశ్వరులు అయిపోండిలా.. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ అదిరే స్కీమ్స్!

ప్రతి నెలా చిన్న మొత్తంతోనే మంచి రాబడి పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. తక్కువ మొత్తంతోనే కోటీశ్వరులు అయిపోవచ్చు. అయితే దీర్ఘకాలం వేచి ఉండాలి.

ప్రధానాంశాలు:చిన్న మొత్తంతో అదిరిపోయే రాబడిదీర్ఘకాలం డబ్బులు పెట్టాలిరూ.100 నుంచి సిప్ చేయొచ్చుకోటీశ్వరులు అవ్వాలని ప్రతి ఒక్కరూ కల కంటుంటారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కొంత మందికి కలగానే మిలిగిపోవచ్చు. అయితే తక్కువ మొత్తంతోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది. దీని కోసం మీరు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలి.

మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టడం వల్ల మంచి రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దీని కోసం దీర్ఘకాలం డబ్బులు కట్టాలి. ప్రతి నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. చిన్న మొత్తంతోనే అధిక రాబడి ఎలా పొందొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.

Also Read: నేటి బంగారం, వెండి ధరలు ఇలా!

ఉదాహరణకు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో రోజుకు రూ.165 ఆదా చేసుకొని నెల చివరిలో రూ.5 వేలు సిప్ చేయాలని అనుకున్నారు. ఇలా మీరు 25 ఏళ్లు డబ్బులు పెట్టాలి. ఇప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.1.6 కోట్లు వస్తాయి. ఇక్కడ 15 శాతం రాబడిని పరిగణలోకి తీసుకున్నాం.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ ఐదేళ్ల రాబడి 26 శాతంగా ఉంది. ఇందులో మీరు రూ.100 నుంచి సిప్ చేయొచ్చు. అదేసమయంలో ఎస్‌బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీ ఫండ్ కూడా ఒకటుంది. ఇది ఐదేళ్ల కాలంలో 22 శాతం రాబడిని అందించింది. ఇందులో రూ.500 నుంచి సిప్ చేయొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Mi QLED TV 75: షియోమీ భారీ టీవీ.. మొదటిసేల్ ఈరోజే.. థియేటర్ తరహా అనుభవం ఇంట్లోనే!

Tue Apr 27 , 2021
ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 75 టీవీ సేల్ మనదేశంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. దీని ధరను రూ.1,19,999గా నిర్ణయించారు.