Raj Kundra: శిల్పా శెట్టి భర్త చుట్టు బిగిస్తున్న ఉచ్చు.. ‘నన్ను వేధించేవారు’ అంటూ హాట్ బ్యూటీ కామెంట్స్‌

పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పశెట్టి భర్త, నిర్మాత రాజ్ కుంద్రాను కొద్ది రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రాజ్ కుంద్రా చుట్టు రోజు రోజుకు ఉచ్చు బిగిసిపోతుంది.

పోర్నోగ్రఫీ కేసులో హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ వ్యవహారం బాలీవుడ్‌‌లో ప్రకంపనలు రేపుతోంది. అనేకమంది నటీమణులు, మోడల్స్‌ రాజ్‌కుంద్రాతో తమకు ఎదురైన అనుభవాలను బహిరంగంగా చెబుతుండటంతో ఆయన మరింత చిక్కుల్లో పడుతున్నారు. ఈ వ్యవహారంలో చాలామంది పేర్లు బయటికి వస్తుండటంతో ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా శిల్పాశెట్టి ఈ కేసుకు సంబంధించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన కెరీర్‌లో బిజీగా ఉన్న కారణంగా తన భర్త ఏం చేస్తున్నారు అనే విషయాలు తనకు తెలిసేవి కాదు అంటు ఆమె పేర్కొన్నారు. ఆయన లావాదేవీలకు సంబంధించిన విషయాలు కూడా తనకు తెలియవు అంటూ ఆమె పేర్కొన్నారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్లు అయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనానికి దారి తీశాయి. తమ యాప్‌లో అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ రాజ్ కుంద్రా అతని క్రియేటివ్ డైరెక్టర్ తనని వేధించేవాళ్లు అంటూ ఆమె పేర్కొన్నారు.

అంతేకాక.. శిల్పాశెట్టిపై కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ‘శిల్పాశెట్టి భర్త అభ్యంతరకర కార్యకలాపాల గురించి తనకు తెలియదని చెబుతోంది. తన భర్త స్థిర ఆస్తుల గురించి తనకు తెలియదని కూడా దీదీ చెబుతోంది. ఈ ప్రకటన ఎంతవరకు నిజమో మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి’ అంటూ ఆమె ఓ వీడియోని విడుదల చేశారు. అంతేకాక.. తన షెర్లిన్ చోప్రా యాప్ వచ్చే ఆదాయాన్ని ఆర్మ్స్ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి సమానంగా వాటాలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నామని.. కానీ, ఇప్పటివరకూ తనకు 50 శాతం వాటా రాలేదని ఆమె పేర్కొంది. అయితే షెర్లిన్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలతో రాజ్ కుంద్రా కేసు మరింత జఠిలం అవుతోంది. మరి ఈ కేసుపై ముంబై పోలీసులు రాజ్ కుంద్రాకు కఠిన శిక్ష విధించాలనే నిర్ణయం తీసుకుంటే.. రాజ్ కుంద్రా భవిష్యత్తు చీకటిలోకి వెళ్లిపోతుంది అంటూ బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Punjab crisis అవమానాల మధ్య కొనసాగలేను.. విసిగిపోయి రాజీనామాకు సిద్ధమైన పంజాబ్ సీఎం

Sat Sep 18 , 2021
పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కి సిద్ధూ రూపంలో అసమ్మతి సెగలు గట్టిగా తగులుతున్నాయి. తొలుత మంత్రివర్గంలో చేరిన సిద్ధూ.. తర్వాత ఆయనతో విబేధించి రాజీనామా చేశారు.