‘లవ్‌స్టోరీ’ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్న శేఖర్ కమ్ముల..

రొటీన్‌కి భిన్నంగా క్లాసిక్ సినిమాలు రూపొందించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ముందు వరుసలో ఉంటాడు. తన మొదటి చిత్రం నుంచి రీసెంట్ సినిమా ‘ఫిదా’ వరకూ అన్ని యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తాయి. అయితే తన లేటెస్ట్ చిత్రం ‘లవ్‌స్టోరీ’ విషయంలో శేఖర్ కమ్ముల దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళిని ఫాలో అవుతున్నారట.

నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘లవ్‌స్టోరీ’. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీన విడుదల కావాలి. కానీ, కరోనా కేసులు ఉదృతం అవుతున్న నేపథ్యంలో విడుదలకు నాలుగు రోజుల ముందు రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. పరిస్థితులు మెరుగైన తర్వాత మళ్లీ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో శేఖర్ కమ్ముల ఏం చేస్తున్నారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఆయన తన సెక్ట్స్ సినిమాకి స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నారా.. లేక కుటుంబంతో సరదాగా గడుపుతున్నారా.. అని అభిమానులు చర్చించుకోవడం ప్రారంభించారు.

అయితే శేఖర్ కమ్ముల మాత్రం అలాంటి పనులేవీ చేయడం లేదట. వాయిదా పడిన తన ‘లవ్‌స్టోరీ’పైనే ఆయన ఇంకా పని చేస్తున్నారట. ఈ విషయంలో ఆయన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమా చిత్రీకరణ పూర్తన తర్వాత నుంచి థియేటర్లలో విడుదల అయ్యే వరకూ సినిమాకి తుది మెరుగులు దిద్దుతుంటారు జక్కన. ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారట. సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు లవ్‌స్టోరీని చెక్కుతున్నారట శేఖర్ కమ్ముల. సినిమా మొత్తం మళ్లీ ఒకసారి చూసిన ఆయన.. కొంచం లెంత్ తగ్గించారట. మొత్తానికి విడుదల సమయానికి ఓ పర్‌ఫెక్ట్ సినిమాని ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నంలో నిమగ్నమయ్యారట ఆయన.

ఇక ‘ఫిదా’ తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్‌స్టోరీ’. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువశాతం ఈ సినిమా షూటింగ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా ‘సారంగ దరియా’ అనే పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

‘నీతులు ముందు వాళ్లకు చెప్పు.. సిగ్గులేకుండా తిరుగుతున్నారు’.. కరీనాపై నెటిజన్లు ఫైర్

Fri Apr 30 , 2021
పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలపై గత కొంతకాలంగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఓవైపు కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతుంటే.. విదేశీ పర్యటనలకు వెళ్లిన కొందరిపై సోషల్‌మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ పెట్టిన హీరోయిన్ కరీనా కపూర్ నెటిజన్లు ఆగ్రహానికి గురైంది.