చాలా నొప్పి, వాచిపోయిందట!.. ఆరోగ్య సమస్యలతో సతమతమైన షణ్ముఖ్ జశ్వంత్

షణ్ముఖ్ జశ్ంత్‌కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో స్టార్‌గా మారిపోయారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేస్తున్నారు. గత ఏడాది సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్ అంటూ అందరినీ కట్టిపడేశారు.

ప్రధానాంశాలు:ట్రెండింగ్‌లో షణ్ముఖ్ జశ్వంత్బిగ్ బాస్ షోలోకి షణ్ముఖ్ఆరోగ్య సమస్యలపై కామెంట్షణ్ముఖ్ జశ్ంత్‌కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో స్టార్‌గా మారిపోయారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేస్తున్నారు. గత ఏడాది సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్ అంటూ అందరినీ కట్టిపడేశారు. ఈ సారి సూర్య అనే వెబ్ సిరిస్‌తో ఆకట్టుకున్నారు. అలా తన నటనతోనే కాకుండా వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు షణ్ముఖ్. మరీ ముఖ్యంగా దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్, లవర్‌గా నెట్టింట్లో ఎక్కువ ట్రోలింగ్‌కు గురవుతుంటారు. దీప్తి సునయన చేసే పనుల్లోనూ షణ్ముఖ్‌ను లాగి మరీ ట్రోల్ చేస్తుంటారు.

అలా షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. ఇక తప్ప తాగి కారు నడిపి, యాక్సిడెంట్ చేసిన కేసులో అయితే షణ్ముఖ్ దారుణంగా బుక్కైపోయాడు. ఒళ్లు తెలియనంతగా తాగేసి.. తన క్రేజ్ గురించి చెప్పుకున్నారు. పోలీసుల ముందు అడ్డంగా దొరికిపోయారు. అలా ఆ కేసుతో షణ్ముఖ్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది.

ఆ కారు ప్రమాదంతో వచ్చిన పబ్లిసిటీతో ఏకంగా బిగ్ బాస్ ఆఫర్ కొట్టేయబోతోన్నాడనే టాక్ కూడా వచ్చింది. అయితే షణ్ముఖ్‌ను గత సీజన్లలోనే తీసుకురావాలని బిగ్ బాస్ యూనిట్ ప్రయత్నించిందట. ఈ సారి కూడా షణ్ముఖ్‌ను అడిగారని, ఆయన కూడా వచ్చేందుకు ఓకే చెప్పినట్టు టాక్. బిగ్ బాస్ కంటెస్టెంట్లలో లీకైన లిస్ట్‌లో షణ్ముఖ్ పేరు కూడా వినిపిస్తోంది.
View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)
తాజాగా షణ్ముఖ్ తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చారు. తనకు దంత సమస్యలు వచ్చాయని, గడిచిన నాలుగు నెలలో రెండుసార్లు ఇంప్లాంట్స్ జరిగాయని, అది రూట్ కెనాల్‌లా సులభంగా ఉండదని చెప్పుకొచ్చారు. అది ఎంతో నొప్పిగా ఉంటుంది, ఎంతో వాచిపోయిందని కానీ ఓరో కేర్ డెంటర్ క్లినిక్ వల్ల ఎంతో త్వరగా రికవరీ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇదేమీ ఆ క్లినిక్‌కు ప్రమోషన్ కాదు అని నొక్కి మరీ చెప్పేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

HBD Nagarjuna : నీతోనే నాకు మొదటిసారి.. రాము బావ అంటూ వయ్యారాలు ఒలకబోసిన అనసూయ

Sun Aug 29 , 2021
అనసూయ ఏది చేసినా ప్రత్యేకమే. తెరపై కనిపించినా, సోషల్ మీడియాలో అల్లరి చేసినా, వెకేషన్స్‌లో ఎంజాయ్ చేసినా కూడా అనసూయ అందరి కంటే స్పెషల్‌గానే ఉంటారు. అలాంటి అనసూయకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.