కరోనా విషాదం.. వైరస్ సోకి సీనియర్ నటి భర్త మృతి.. దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ మహమ్మారి సోకి పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో నటించిన అలనాటి నటి మాలా శ్రీ భర్త, నిర్మాత కొణిగల్ రాము కరోనా సోకి కన్నుమూశారు.

రెండో దశలో కరోనా వైరస్ విశృంఖలంగా వ్యాపిస్తోంది. కొంచం అజాగ్రత్తగా ఉన్నా.. వెంటనే వైరస్ సోకి ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఓ వైపు ఈ ఉదృతిని ఆపేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. వైరస్ వ్యాప్తి కట్టడి కావడం లేదు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు మరోసారి అమలులోకి రావడం ప్రారంభం అయ్యాయి. అయితే ఈసారి కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగా ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

తాజాగా అలానాటి నటి మాలా శ్రీ భర్త, ప్రముఖ నిర్మాత కొణిగల్ రాము కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కన్నడ ఇండస్ట్రీలో ఆయన హై బడ్జెట్ నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏకే47, లాకప్ డెత్, సీబీఐ తదితర సినిమాలను ఆయన నిర్మించారు. ఇక మాలా శ్రీకి తెలుగులో విజయశాంతికి ఉన్నంత గుర్తింపు ఉంది. తెలుగులో కూడా ఆమె పలు సినిమాల్లో నటించింది. ‘బావబామ్మర్ది’, ‘భలే మామయ్యా’, ‘అల్లరిపోలీస్’ చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించారు.

అయితే కొన్ని రోజుల క్రితం కొణిగల్ రాముకు కరోనా సోకింది. దీంతో ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రాము, మాలా శ్రీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాము మృతితో కన్నడ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు నివాళులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మే 2 తరువాతే కోవిడ్ కట్టడికి ఏ కఠిన నిర్ణయమైనా.. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ?!

Tue Apr 27 , 2021
National health emergency దేశంలో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.