కూతురు మరణంపై అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్.. తెల్లారేసరికి అలా! ఆమె చావుకు కారణం అదేనంటూ ఓపెన్

దత్త పుత్రికను ఎంతో ఆప్యాయంగా పెంచుకొని పెళ్లీడుకొచ్చాక ఘనంగా వివాహం జరిపించి అత్తారింటికి పంపారు అన్నపూర్ణ. అయితే కొంత కాలానికే ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకోవడం ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది. తాజాగా ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు అన్నపూర్ణ.

కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకున్నారు అన్నపూర్ణ. దాదాపు 700 సినిమాలకు పైగా మూవీస్ చేసిన ఆమె.. ఓ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. అయితే ఆ అమ్మాయి పెద్ద వయసు వచ్చి, పెళ్లి కూడా చేసుకున్నాక ఆత్మహత్య చేసుకోవడం అన్నపూర్ణకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కూతురు మనస్తత్వం గురించి ఓపెన్‌గా మాట్లాడిన అన్నపూర్ణ.. ఆమె మరణంపై రియాక్ట్ అయ్యారు.

దత్త పుత్రికను ఎంతో ఆప్యాయంగా పెంచుకొని పెళ్లీడుకొచ్చాక ఘనంగా వివాహం జరిపించి ఆమెను అత్తారింటికి పంపారు అన్నపూర్ణమ్మ. తన స్తోమతకు తగ్గట్లుగా కట్న కానుకలు కూడా ఇచ్చి సాగనంపారు. అయితే అంతా సవ్యంగానే గడుస్తూ ఓ బిడ్డ జన్మించాక ఆమె బెడ్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో అన్నపూర్ణ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కూతురు మరణం గురించి వివరంగా అన్ని విషయాలు చెప్పారు అన్నపూర్ణమ్మ.
Narappa Trailer: చించేసిన విక్టరీ హీరో.. భారీ హైప్ క్రియేట్ చేసిన వెంకీ పవర్‌ఫుల్ సీన్స్
తన బిడ్డ ఎప్పుడూ అత్తారింట్లో బాధ పెట్టారని కానీ, భర్త కష్ట పెడుతున్నాడని కానీ చెప్పలేదని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. అసలు వాళ్ళింట్లో ఏం జరిగిందనేది మాత్రం తనకు తెలియదని చెప్పారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళే కానీ.. ఎందుకిలా చేసుకుందో తనకైతే అర్థం కాలేదని అన్నారు. కాకపోతే తన బిడ్డకు కాస్త కోపం ఎక్కువ అని, సమస్య ఏంటనేది మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా అలా వెళ్లిపోయిందని అన్నపూర్ణ చెప్పారు. సంతోషంగానే అత్తారింటికి వెళ్ళింది కానీ ఏదో చిన్న మాటకు హార్ట్ అయ్యి ఇలా చేసుకొని ఉండొచ్చు అని ఆమె అన్నారు.

ఇక తన బిడ్డకు పుట్టిన పాపను కొన్ని నెలల పాటు తానే పెంచానని చెప్పిన అన్నపూర్ణ.. ఆ తర్వాత ఆమె వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఆ పాప వయసు 5 సంవత్సరాలు ఉంటుందని.. నాన్నతో సంతోషంగా ఉంటోందని అన్నపూర్ణ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చంద్రబాబుకి అల్లుడి సెగ.. నెక్స్ట్ సీఎం ఆయనే.! అధినేత ఎదుటే అతి ఉత్సాహం

Wed Jul 14 , 2021
గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో చతికిలపడిన తెలుగుదేశంలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. అధినేత ఎదుటే తెలుగు తమ్ముళ్లు అల్లుడిని కీర్తించడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.