కొత్తగా కారు కొనే వారికి ఎస్‌బీఐ 3 అదిరిపోయే ఆఫర్లు!

కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మూడు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. యోనో ద్వారా కారు కొనే వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

ప్రధానాంశాలు:కారు కొనే వారికి తీపికబురుఎస్‌బీఐ బంపరాఫర్లు 3 ప్రయోజనాలుమీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కారు కొనే వారికి తీపికబురు అందించింది. పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. దీంతో కారు కొనే వారికి ప్రయోజనం కలుగనుంది.

ఎస్‌బీఐ తన యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఆఫర్లు అందిస్తోంది. హ్యుందాయ్ అల్కాజర్ కారు కొనే వారికి మాత్రమే ఆఫర్లు లభిస్తాయి. ఇది 6, 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు కొంటే మీకు వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపు లభిస్తుంది.

అంతేకాకుండా కారు ధరకు సమానమైన మొత్తంలో బ్యాంక్ నుంచి లోన్ పొందొచ్చు. అంటే 100 శాతం ఆన్‌రోడ్ ఫైనాన్స్ లభిస్తుంది. ఇంకా జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా ఉంది. ఈ ప్రయోజనాలన్నీ మీరు యోనో ద్వారా కారు కొనుగోలు చేస్తేనే లభిస్తాయి.

Also Read: కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. కేవలం రూ.500తో బుక్ చేసుకోండిలా!

Also Read: SBI కస్టమర్లకు హెచ్చరిక.. ఈరోజు, రేపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అలా కోరడం ఏపీ ప్రభుత్వ పిల్ల చేష్టలకు నిదర్శనం.. మంత్రి జగదీష్ రెడ్డి

Fri Jul 16 , 2021
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమయ్యింది. దీనిని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.