SBI కస్టమర్లకు హెచ్చరిక.. ఈరోజు, రేపు..

మీరు ఎస్‌బీఐ కస్టమర్లా? మీకు బ్యాంక్‌లో ఖాతా ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈరోజు, రేపు బ్యాంక్ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలుగనుంది. ట్విట్టర్ వేదికగా బ్యాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రధానాంశాలు:ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్ఈరోజు రేపు సర్వీసులకు అంతరాయంట్వీట్ చేసిన బ్యాంక్దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI మీకు అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బ్యాంక్ ఆన్‌లైన్ సర్వీసులు మరోసారి కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవు. దీంతో కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించాలి.

స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. జూలై 16న 22.45 గంటల నుంచి జూలై 17న 01.15 గంటల వరకు బ్యాంక్ ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. ఈ సమయంలో నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సర్వీసులు అందుబాటులో ఉండవు.

ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని ఎస్‌బీఐ కోరింది. మెయింటెనెన్స్ కార్యకలాపాల కారణంగా ఈ అసౌకర్యం కలుగుతోందని వివరించింది. ఇది వరకు కూడా ఇలా మెయింటెన్స్ కారణంగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ సర్వీసులను పలు సార్లు నిలిచిపోయాయి.

Also Read: భగ్గుమంటున్న బంగారం ధర.. వెండి దూకుడు.. లేటెస్ట్ రేట్లు ఇలా!

Also Read: కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. కేవలం రూ.500తో బుక్ చేసుకోండిలా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కొత్తగా కారు కొనే వారికి ఎస్‌బీఐ 3 అదిరిపోయే ఆఫర్లు!

Fri Jul 16 , 2021
కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మూడు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. యోనో ద్వారా కారు కొనే వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి.