SBI హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. ఇంకో 10 రోజులే గడువు.. వెంటనే ఇలా చేయండి!

మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈ నెలాఖరు కల్లా కచ్చితంగా ఒక పని చేయాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. జరిమానా కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది.

ప్రధానాంశాలు:బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరికఇంకో 10 రోజులే గడువువెంటనే ఇలా చేయండిమీకు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో అకౌంట్ ఉందా? లేదంటే దేశీ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతా కలిగి ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఈ నెలాఖరులోగా కచ్చితంగా ఒక పని పూర్తి చేయాలి.

కేవలం ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు మాత్రమే కాకుండా బ్యాంక్‌లో ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ వారి పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆధార్ పాన్ లింక్ అనుసంధానికి జూన్ నెల చివరి వరకు మాత్రమే అవకాశం ఉంది.

Also Read: గుడ్ న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధర.. పడిపోయిన వెండి.. ఈ రేట్లు ఇవే!

అందువల్ల మీరు వెంటనే పాన్ ఆధార్ లింక్ చేసుకోండి. లేదంటే పాన్ కార్డు చెల్లదు. అప్పుడు మీరు పలు ట్రాన్సాక్షన్లు నిర్వహించలేరు. బ్యాంకులో ఒక రోజులో రూ.50 వేలకు పైన ట్రాన్సాక్షన్లు నిర్వహించాలంటే పాన్ ఉండాల్సిందే. బ్యాంక్ ఖాతా ఓపెనింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇలా ప్రతి ఒక్క దానికి పాన్ కార్డు కావాలి.

అంతేకాకుండా మీరు ఒకవేళ పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోకపోతే జరిమానా కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకొని వారికి జరిమానా విధిస్తుంది. అందువల్ల మీరు వెంటనే రెండింటినీ లింక్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

RRR: రామ్ చరణ్ ఆన్ ఫైర్.. మెగా, నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్

Mon Jun 21 , 2021
రీసెంట్‌గా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వచ్చిన బ్రేక్‌కి ఇక ఫుల్‌స్టాప్ పడిందని తెలుపుతూ మెగా, నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్.