పాకిస్థాన్ సరిహద్దుల్లో వేలాది మంది అఫ్గన్లు పాడిగాపులు.. బయటపెట్టిన శాటిలైట్ చిత్రాలు

అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం తరలింపు కొనసాగుతుండగానే తాలిబన్లు చాపకింద నీరులా వ్యాపించారు. ఒక్కొక్కటిగా తమ అధీనంలోకి తెచ్చుకుని చివరిగా కాబూల్‌ను వశం చేసుకున్నారు.

ప్రధానాంశాలు:అఫ్గన్ ప్రజలను వెంటాడుతున్న తాలిబన్ల దుష్టపాలన దేశం విచిడి వెళ్లిపోతున్న వేలాది మంది అఫ్గన్లు.రోడ్డు మార్గంలో సరిహద్దులకు చేరుకుని నిరీక్షణ.అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత స్వదేశం వీడేందుకు కాబూల్ విమానాశ్రయం వద్ద వేలాది మంది ప్రజలు పడిగాపులు కాచిన దృశ్యాలు యావత్తు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేశాయి. దాదాపు 20 ఏళ్ల కిందట తాలిబన్ల దుర్మార్గపు పాలన గుర్తుకుతెచ్చుకుని దేశం విడిచి వెళ్లడానికి ప్రాణాలను సైతం అఫ్గన్ల లెక్కచేయడం లేదు. అమెరికా విమానం రెక్కలపై కూడా ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికీ ఇంకా అక్కడ అదే పరిస్థితి కొనసాగుతోంది.

ఆగస్టు 31న అమెరికా సైన్యం ఆపరేషన్ ముగియడంతో కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు, ఇతర మార్గాల గుండా దేశం దాటేందుకు వేలాది మంది ప్రయత్నిస్తున్నట్టు తాజాగా శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్, ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో క్షేత్రస్థాయి పరిస్థితికి ఇవి అద్దం పడుతున్నాయి. పాకిస్థాన్ సరిహద్దుల్లో వేలాది మంది అఫ్గన్లు చిక్కుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. తజికిస్థాన్ సరిహద్దుల్లో షిర్ ఖాన్, ఇరాన్ సరిహద్దుల్లోని ఇస్లాం ఖలా, పాక్ సరిహద్దుల్లోని, చమన్, టోర్ఖమ్ వద్ద వేలాది మంది పడిగాపులు కాస్తున్నారు.

పాక్, అఫ్గనిస్థాన్ మధ్య ప్రధానంగా రాకపోకలు సాగించే మార్గాల్లో స్పిన్ బల్దోక్‌లోని చమన్ ఒకటి. గత కొద్ది వారాలుగా ఇక్కడ రద్దీ మరింత పెరిగింది. అఫ్గన్ ప్రజలు తమ పిల్లాపాపలతో దేశం విడిచి వెళ్లిపోయేందుకు సరిహద్దుల వద్దకు వస్తున్నారు. కాబూల్ సహా ఇతర నగరాల నుంచి భారీగా ఇక్కడకు చేరుకుని సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

చమన్ సరిహద్దుల్లో సెప్టెంబరు 6న ఉపగ్రహాలు రికార్డు చేసిన దృశ్యాలలో వేలాది మంది గుమిగూడి ఉన్నారు. అఫ్గన్ నుంచి భారీగా జనం తరలి రావడంతో పాకిస్థాన్ చమన్ సరిహద్దులను గతవారం మూసివేసింది. తాలిబన్ పాలనపై భయంతో అఫ్గన్ ప్రజలు స్వదేశంలో ఆస్తులను వదిలేసి వెళ్లపోవడానికి వెనుకాడటంలేదనడానికి ఇది నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తాలిబన్లకు ఆశ్రయమిచ్చిన పాక్‌తో సంబంధాలపై పునరాలోచిస్తాం.. అమెరికా కీలక వ్యాఖ్యలు

Tue Sep 14 , 2021
గత 20 ఏళ్లలో అమెరికా సైన్యం పోరాటాలు చేస్తుంటే.. అఫ్గన్‌లో తాలిబన్ల దాడులకు పాకిస్థాన్ సహకరించినట్టు తాజా పరిణామాలతో బహిర్గతమయ్యిందని అమెరికా వ్యాఖ్యానించింది.