రూ.12 వేలలోపే శాంసంగ్ ట్యాబ్లెట్.. కేక పెట్టించే ఫీచర్లు.. మరో ట్యాబ్ కూడా!

శాంసంగ్ తన కొత్త ట్యాబ్లెట్లను మనదేశంలో లాంచ్ చేసింది. అవే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ, ఏ7 లైట్ ట్యాబ్లెట్లు. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభం కానుంది.

ప్రధానాంశాలు:శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎఫ్ఈ, ఏ7 లైట్ వచ్చేశాయ్ధర రూ.11,999 నుంచి ప్రారంభంశాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ, ఏ7 లైట్ ట్యాబ్లెట్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ట్యాబ్లెట్లు గతంలోనే యూరోపియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇవి తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందించనున్నాయి. అయితే మనదేశంలో లాంచ్ అయిన లాంచ్ అయిన మోడల్‌లో 5జీని శాంసంగ్ అందించలేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎఫ్ఈ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.46,999గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను రూ.50,999గా నిర్ణయించారు. మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ పింక్, మిస్టిక్ సిల్వర్ రంగుల్లో ఇది కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఏ7 లైట్ ధర
ఇందులో కూడా రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఎల్టీఈ వేరియంట్ ధర రూ.14,999గా ఉండగా, అదే స్టోరేజ్ ఉన్న వైఫై మోడల్ ధర రూ.11,999గా ఉంది. గ్రే, సిల్వర్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. జూన్ 23వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది.

వీటిపై లాంచ్ ఆపర్లను కూడా శాంసంగ్ అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎఫ్ఈని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఏ7 లైట్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అందించారు.
ఆన్‌లైన్‌లో కనిపించిన పోకో ఎఫ్3 జీటీ.. లాంచ్ అయితే బెస్ట్ అయ్యే అవకాశం!
శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో 12.4 అంగుళాల డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 10900 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ ట్యాబ్లెట్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 190 నిమిషాలు పడుతుంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎఫ్ఈ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. 5జీ, వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఎస్ పెన్ కూడా అందించనున్నారు. దీని మందం 0.63 సెంటీమీటర్లుగానూ, బరువు 608 గ్రాములుగానూ ఉంది.
మరో బెస్ట్‌టీవీని మార్కెట్లో లాంచ్ చేసిన టీవీ.. 65 అంగుళాల స్క్రీన్.. ధర ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఏ7 లైట్ స్పెసిఫికేషన్లు
ఇందులో 8.7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. 4జీ, వైఫై, బ్లూటూత్ ఎల్ఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్ సెటప్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.8 సెంటమీటర్లుగా ఉంది. వైఫై మోడల్ బరువు 366 గ్రాములు కాగా, ఎల్టీఈ మోడల్ బరువు 371 గ్రాములుగా ఉంది.
ఈ ఫోన్ సబ్బుతో కడిగేయచ్చు.. మోటొరోలా సూపర్ స్ట్రాంగ్ ఫోన్ వచ్చేసింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Suman: ‘పెద్దింటల్లుడు’ కు 30 ఏళ్ళు.. సుమన్ నట విశ్వరూపం.. నగ్మా ఎంట్రీతోనే బంపర్ హిట్

Fri Jun 18 , 2021
యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న సుమన్‌ ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం తనవైపుకి తిప్పుకున్నారు. సంచలన తార నగ్మా ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రంతోనే.. మోహన్ బాబు, వాణిశ్రీ ఇలా అగ్రనటులంతా ఈ చిత్రంలో నటించారు.