ఈ శాంసంగ్ సూపర్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.6 వేలు తగ్గింపు.. ఇప్పుడు ఎంతకు కొనొచ్చంటే?

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో భారీ తగ్గింపును అందించారు. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.6 వేల వరకు తగ్గింపు లభించనుంది. దీనికి సంబంధించి అమెజాన్‌లో ప్రత్యేక కూపన్‌ను కూడా అందించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ స్మార్ట్‌‌ఫోన్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. ఇప్పుడు అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్‌లో ఈ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. ఏకంగా రూ.6 వేల వరకు డిస్కౌంట్‌ను దీనిపై పొందవచ్చు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను అందించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.55,999గా ఉంది. అయితే దానిపూ రూ.8,000 తగ్గించి, రూ.47,999కే కంపెనీ అందించింది. ఇప్పుడు మరో రూ.6,000 తగ్గింపుతో రూ.41,999కే ఈ ఫోన్ కొనవచ్చన్న మాట.

అయితే ఈ ఫోన్ మీరు అమెజాన్‌లో కొన్నప్పుడు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు కార్ట్‌కు యాడ్ చేసేటప్పుడు రూ.47,999నే చూపించినప్పటికీ.. చెకౌట్ సమయంలో రూ.41,999 కూపన్ యాడ్ అవుతుంది. క్లౌడ్ లావెండర్, క్లౌడ్ మింట్, క్లౌడ్ నేవీ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఈ 8 యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. లేకపోతే డేటా హుష్‌కాకి!
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లేను శాంసంగ్ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉంది. ఈ ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌పై పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా ప్రధాన కెమెరాగా 12 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించగా, దీంతోపాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా కూడా అందించారు.

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో కూడా ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్ బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఈ ఫోన్ మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 190 గ్రాములుగానూ ఉంది. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
ఎంఐ 11 లైట్ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. చూడటానికి అందంగా.. ధర ఎంత ఉండనుందంటే?
Samsung Galaxy S20 FE 5G స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్Qualcomm SM8250 Snapdragon 865 (7 nm+)డిస్_ప్లే6.5 inches (16.51 cm)స్టోరేజ్_ఫైల్128 GBకెమెరాా12 MP + 8 MP + 12 MPబ్యాటరీ4500 mAhprice_in_india51400ర్యామ్6 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిఇతర వేరియంట్లు Samsung Galaxy S20 FE 5G Samsung Galaxy S20 FE 5G 128GB 8GB RAMSamsung Galaxy S20 FE 5G 256GB 8GB RAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నేటి అమెజాన్ క్విజ్ సమాధానాలు ఇవే.. ఎంత గెలవచ్చంటే?

Mon Jun 21 , 2021
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ క్విజ్‌లో నేడు(జూన్ 21వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.ఐదు వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.