శాంసంగ్ కొత్త ఫోన్ ఫీచర్లు లీక్.. ధర బడ్జెట్‌లోనే ఉండే అవకాశం!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్ గెలాక్సీ ఎం21 2021ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ప్రధానాంశాలు:త్వరలో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021స్పెసిఫికేషన్లు లీక్శాంసంగ్ గతేడాది మనదేశంలో ఎం21 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందులోనే లేటెస్ట్ వెర్షన్‌గా శాంసంగ్ గెలాక్సీ ఎం21(2021) లాంచ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ ఇటీవలే గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో కూడా కనిపించింది.

దీన్ని మొదట 91మొబైల్స్ గుర్తించింది. దీని ప్రకారం గెలాక్సీ ఎం21(2021) హార్డ్‌వేర్ మొత్తం దాదాపు గెలాక్సీ ఎం21 తరహాలోనే ఉండనుంది. దీంతోపాటు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు సమాచారం.
మూడు బడ్జెట్ ఫోన్ల రేట్లు పెంచిన శాంసంగ్.. వేటి ధరలు ఎంత పెరిగాయంటే?
మిగతా ఫీచర్లన్నీ శాంసంగ్ గెలాక్సీ ఎం21 తరహాలోనే ఉండనున్నాయి. అయితే శాంసంగ్ ఒకే ఫీచర్లతో మరో ఫోన్ లాంచ్ చేయడం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఆపరేటింగ్ సిస్టం విషయంలో మాత్రం గెలాక్సీ ఎం21(2021)ను అప్‌‌గ్రేడ్ చేశారు. ఇందులో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను అందించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎం21 మనదేశంలో రూ.14 వేల ధరలోనే లాంచ్ అయింది. కాబట్టి గెలాక్సీ ఎం21(2021) కూడా ఇదే ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం21 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6,000 ఎంఏహెచ్ గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేయడం విశేషం. ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ గా ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అందించారు. ఫోన్ వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. ఫేస్ అన్ లాక్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి సెన్సార్లను శాంసంగ్ గెలాక్సీ ఎం321 స్మార్ట్ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ కేవలం 0.89 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంది. దీని బరువు 188 గ్రాములుగా ఉంది.
మోటొరోలా కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.20 వేలలోపే సూపర్ ఫీచర్లు!
Samsung Galaxy M21 2021 స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్Exynos 9611 (10nm)డిస్_ప్లే6.5 inches (16.51 cm)స్టోరేజ్_ఫైల్128 GBకెమెరాా48 MP + 8 MP + 5 MPబ్యాటరీ6000 mAhprice_in_india14834ర్యామ్4 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అసుస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ పక్కా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Fri Jul 9 , 2021
అసుస్ తన జెన్‌ఫోన్ 8 సిరీస్‌ను ఇటీవలే గ్లోబల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ మనదేశంలో అసుస్ 8జెడ్ పేరుతో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది.